రామ్ పోతినేని సినిమాతో తెలుగు చిత్రసీమకు పరిచయం కానున్న సంచలన తమిళ సంగీత ద్వయం వివేక్ – మెర్విన్

0
54
Rapo22 Welcomes Vivek Mervin
Rapo22 Welcomes Vivek Mervin

రామ్ పోతినేని – మహేష్ బాబు పి – మైత్రీ మూవీ మేకర్స్ సినిమాతో తెలుగు చిత్రసీమకు పరిచయం కానున్న సంచలన తమిళ సంగీత ద్వయం వివేక్ – మెర్విన్

తెలుగు చలనచిత్ర పరిశ్రమకు ప్రతిభావంతులను పరిచయం చేసే విషయంలో ఉస్తాద్ రామ్ పోతినేని ఎప్పుడూ ముందుంటారు. అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ కూడా అంతే. ప్రతిభ పట్టం కడుతూ కొత్తవారికి స్వాగతం పలుకుతుంది. రామ్ హీరోగా మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై మహేష్ బాబు పి దర్శకత్వంలో నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మిస్తున్న సినిమాతో తెలుగు పరిశ్రమకు కొత్త సంగీత దర్శకులను పరిచయం చేస్తున్నారు.

#RAPO22 చిత్రానికి టాలెంటెడ్ అండ్ కోలీవుడ్ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్స్ వివేక్ – మెర్విన్ సంగీతం అందించనున్నట్లు ఈ రోజు తెలిపారు. ఈ సంచలన సంగీత ద్వయానికి రామ్ సోషల్ మీడియా ద్వారా స్వాగతం పలికారు. ”తెలుగు తెరపై సరికొత్త సంగీత సంచలనానికి స్వాగతం” అని రామ్ ట్వీట్ చేశారు.

వివేక్ శివ, మెర్విన్ సాల్మన్… ఇద్దరూ కలిసి వివేక్ – మెర్విన్ పేరుతో మ్యూజిక్ చేయడం మొదలు పెట్టారు. తమిళంలో తొలి సినిమా ‘వడా కర్రీ’తో మంచి పేరు తెచ్చుకున్నారు. అయితే… వాళ్లిద్దరూ సంగీతం అందించిన ప్రయివేట్ మ్యూజిక్ ఆల్బమ్ సాంగ్ ‘ఓర్శాడా…’, ‘పక్కం నీయుమ్ ఇళ్లై…’ చార్ట్ బస్టర్లుగా నిలిచాయి. ధనుష్ హీరోగా నటించిన ‘పటాస్’ చిత్రానికి సంగీతం అందించారు. ఆ సినిమాలోని ‘చిల్ బ్రో…’ సాంగ్, ఇంకా ప్రభుదేవా ‘గులేబకావళి’లోని గులేబా సాంగ్, కార్తీ ‘సుల్తాన్’ సినిమాలోని సాంగ్స్… ఇలా వివేక్ – మెర్విన్ సూపర్ డూపర్ హిట్ పాటలకు మ్యూజిక్ అందించారు. ఇప్పుడీ సంగీత ద్వయాన్ని తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేస్తున్నారు రామ్, దర్శకుడు మహేష్ బాబు పి.

Rapo22 Welcomes Vivek Mervin
Rapo22 Welcomes Vivek Mervin

తమిళ సంగీతం వినే ప్రేక్షకులకు వివేక్ – మెర్విన్ పరిచయమే. రామ్ సినిమాతో వాళ్ళిద్దరూ టాలీవుడ్ ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ అవుతుండడంతో సంగీత ప్రియులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.‌ తెలుగులో తమ తొలి సినిమాకు వాళ్ళిద్దరూ ఎటువంటి పాటలు అందిస్తారోననే ఆసక్తి మొదలైంది.

#RAPO22లో రామ్ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే.‌ ప్రస్తుతం ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపిక చేస్తే పనుల్లో దర్శక నిర్మాతలు బిజీగా ఉన్నారు. ఈ సినిమాకు నిర్మాణ సంస్థ: మైత్రీ మూవీ మేకర్స్, సీఈవో: చెర్రీ, సంగీతం: వివేక్ – మెర్విన్, నిర్మాతలు: నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి, కథ, కథనం, దర్శకత్వం: మహేష్ బాబు పి.

Rapo22 Welcomes Vivek Mervin
Rapo22 Welcomes Vivek Mervin

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here