నేపాల్‌లో శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటోన్న సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ ‘జాక్- కొంచెం క్రాక్’

0
54
Bommarillu Bhaskar's birthday was celebrated on - Jack - Konchem Crack Shoot In Nepal
Bommarillu Bhaskar's birthday was celebrated on - Jack - Konchem Crack Shoot In Nepal

నేపాల్‌లో శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటోన్న స్టార్ బాయ్ సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ హీరోగా బి.వి.ఎస్‌.ఎన్‌.ప్ర‌సాద్ నిర్మిస్తోన్న చిత్రం ‘జాక్- కొంచెం క్రాక్’… శరవేగంగా జ‌రుగుతోన్న‌ షూటింగ్.. సెట్స్‌లో డైరెక్ట‌ర్ బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ బ‌ర్త్ డే సెల‌బ్రేష‌న్స్‌

సిద్ధు జొన్నలగడ్డ.. రీసెంట్‌గా డీజే టిల్లు చిత్రానికి సీక్వెల్ టిల్లు స్క్వేర్తో బ్లాక్ బస్టర్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈయ‌న క‌థాయ‌కుడిగా బ్లాక్ బ‌స్ట‌ర్ డైరెక్ట‌ర్ బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న తాజా చిత్రం ‘జాక్’. ‘కొంచెం క్రాక్’ ట్యాగ్ లైన్. విల‌క్ష‌ణ‌మైన సినిమాలు చేయ‌టానికి ఇష్ట‌ప‌డే సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ‌, బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ కాంబోలో మ‌రో కొత్త జోన‌ర్ మూవీగా జాక్ తెర‌కెక్కుతోంది. ఆడియెన్స్‌కు ఓ స‌రికొత్త ఎక్స్‌పీరియెన్స్‌ను అందించే చిత్రంగా ఇది రూపొందుతోంది. శ్రీవెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర బ్యాన‌ర్‌పై సీనియ‌ర్ ప్రొడ్యూస‌ర్ బివిఎస్ఎన్‌.ప్ర‌సాద్ ఈ మూవీని నిర్మిస్తున్నారు.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ నేపాల్‌లో శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. ప్ర‌కాష్ రాజ్‌, వైష్ణ‌వి చైత‌న్య త‌దిత‌రుల‌పై కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తున్నారు. సోమ‌వారం చిత్ర ద‌ర్శ‌కుడు బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ పుట్టిన‌రోజు. ఈ సంద‌ర్భంగా సెట్స్‌లో ఆయ‌న బ‌ర్త్‌డే సెల‌బ్రేష‌న్స్‌జ‌రిగాయి. హీరో సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ‌, హీరోయిన్ వైష్ణ‌వి చైత‌న్య‌, నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌.ప్ర‌సాద్, ప్ర‌కాష్ రాజ్ స‌హా చిత్ర యూనిట్ పాల్గొన‌గా బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ కేట్ క‌ట్ చేశారు.

‘జాక్- కొంచెం క్రాక్’ సినిమా 80 శాతం పైగానే చిత్రీక‌ర‌ణ పూర్త‌య్యింది.  అచ్చు రాజ‌మ‌ణి ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు. స‌రికొత్త జోన‌ర్‌, ఫ్రెష్ కామెడీ, వావ్ అనిపించే సౌండ్ ట్రాక్‌ను అచ్చు రాజ‌మ‌ణి సిద్ధం చేస్తున్నారు. సినిమాపై మంచి అంచ‌నాలున్నాయి. సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ టైటిల్ రోల్‌ను పోషిస్తున్నారు. త‌నే క్రాక్ గాడు ఎందుకుంటాడ‌నేదే తెలియాలంటే మాత్రం సినిమా చూడాల్సిందేనంటున్నారు మేక‌ర్స్‌. లాఫింగ్ రైడ్‌లా సినిమా ఉంటుంది. బేబి సినిమా ఫేమ్ వైష్ణ‌వి చైత‌న్య ఇందులో హీరోయిన్‌గా న‌టిస్తుంది. త్వ‌ర‌లోనే మ‌రిన్ని వివ‌రాల‌ను తెలియ‌జేస్తామ‌ని మేక‌ర్స్ తెలిపారు.

Bommarillu Bhaskar's birthday was celebrated on - Jack - Konchem Crack Shoot In Nepal
Bommarillu Bhaskar’s birthday was celebrated on – Jack – Konchem Crack Shoot In Nepal

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here