‘మత్తువదలరా2’ను ఊహించిన దాని కంటే పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకు, మీడియాకు ప్రత్యేక ధన్యవాదాలు. సినిమా ఇంకా స్ట్రాంగ్ గా రన్ అవుతోంది. పార్ట్ 3 కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నాం: బ్లాక్ బస్టర్ ప్రెస్ మీట్ లో మత్తువదలరా2 టీం
శ్రీ సింహ కోడూరి, సత్య లీడ్ రోల్స్ లో రితేష్ రానా దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన హిలేరియర్స్ థ్రిల్లర్ ‘మత్తువదలరా2’. ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా నటించారు. ప్రతిష్టాత్మక బ్యానర్ మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై చిరంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు ఈ చిత్రాన్ని నిర్మించారు. సెప్టెంబర్ 13న విడుదలైన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షుకులని అలరించిన హిలేరియస్ బ్లాక్ బస్టర్ ని అందుకొని సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ బ్లాక్ బస్టర్ ప్రెస్ మీట్ ని నిర్వహించారు.
బ్లాక్ బస్టర్ ప్రెస్ మీట్ లో హీరో శ్రీ సింహ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. మేము ఎక్స్ పెక్ట్ చేసినదాని కంటే సినిమా పెద్ద హిట్ అయినందుకు చాలా హ్యాపీగా వుంది. ఆడియన్స్ అందరికీ థాంక్ యూ. నేను వర్క్ చేసిన బెస్ట్ టీం ఇది. చాలా పాషనేట్ గా వర్క్ చేసే టీం ఇది. ఇంత పాషనేట్ టీంలో నేను పార్ట్ అయినందుకు చాలా హ్యాపీగా వుంది. పార్ట్ 3 కోసం మీలానే నేను ఈగర్ గా వెయిట్ చేస్తున్నాను. డైరెక్టర్ రితేష్ త్వరగా చేయాలని కోరుకుంటున్నాను. అందరికీ థాంక్ యూ’ అన్నారు.
హీరోయిన్ ఫారియా అబ్దుల్లా మాట్లాడుతూ… అందరికీ నమస్కారం. సినిమా చాలా అద్భుతంగా ఆడుతోంది. సినిమాతో పాటు నా పెర్ఫార్మెన్స్ కి వండర్ ఫుల్ రెస్పాన్స్ రావడం చాలా సంతోషంగా వుంది. చెర్రీ గారికి చాలా థాంక్ యూ, రవి గారికి థాంక్. మైత్రీతో ఫ్యూచర్ లో ప్రాజెక్ట్స్ చేయాలని కోరుకుంటున్నాను. రితేష్ మూడో పార్ట్ లో నన్ను ఎంపిక చేయాలని కోరుతున్నాను. అందరికీ థాంక్ యూ’ అన్నారు
డైరెక్టర్ రితిష్ రానా మాట్లాడుతూ..అందరికీ నమస్కారం. మీడియాకి థాంక్ యూ, సినిమా చూసి ఇంత గొప్పగా ఆదరించిన ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు’ తెలిపారు
నిర్మాత చెర్రీ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. .ఈ సినిమా ఫస్ట్ కాపీ చూసినప్పుడు డెఫినెట్ గా బాగా ఆడుతుందని నమ్మకం ఉండింది. రిలీజ్ అయిన తర్వాత ఈ సినిమాని ఇంత పెద్ద ఎత్తులో ఆదరించిన ప్రేక్షకులందరికీ నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ప్రేక్షకులందరూ చాలా పెద్ద హిట్ చేశారు. మీడియా కూడా చాలా సపోర్ట్ చేసింది. చాలా మంచి రివ్యూస్ ఇచ్చారు. మీడియాకి కృతజ్ఞతలు. ఈ సినిమా ఇంత పెద్ద సక్సెస్ అవ్వడానికి కారుకులు డైరెక్టర్ రితీష్ రానా, సింహ సత్య, ఫారియా, ఇలా టీమ్ లో అందరూ అద్భుతంగా పెర్ఫాం చేశారు. చాలా రోజుల తర్వాత థియేటర్లో రెండు గంటల పాటు హాయిగా నవ్వుకున్నామని చాలామంది ఆడియన్స్ చెప్పారు. ఇది మాకు చాలా ఆనందం ఇచ్చింది. ఈ సినిమా ఒక మంచి స్ట్రెస్ బస్టర్ అని చాలామంది చెబుతున్నారు. రన్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు. టెన్ డేస్ అయ్యింది. సినిమా ఇంకా స్ట్రాంగ్ గా వెళ్తుంది. దసరా వరకు రన్ అద్భుతంగా ఉంటుందనే నమ్మకం ఉంది. ఈ సినిమాని ఇంత సక్సెస్ చేసిన ఆడియన్స్ అందరికీ థాంక్యూ వెరీ మచ్’అన్నారు.
నిర్మాత వై రవిశంకర్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. సినిమాని ఊహించిన దాని కంటే పెద్ద హిట్ చేసిన ఆడియన్స్ అందరికీ ధన్యవాదాలు. సినిమాని బిగినింగ్ నుంచి ఎంతో సపోర్ట్ చేసిన మీడియాకి థాంక్యూ. ఈ సినిమా మా అంచనాలను క్రాస్ చేసి వరల్డ్ వైడ్ గా 30+cr కలెక్ట్ చేసింది. నార్త్ అమెరికాలో వన్ మిలియన్ మార్క్ దాటింది. ఓవర్సీస్ లోనే 10 కోట్లు కలెక్ట్ చేయడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఆంధ్ర తెలంగాణ కర్ణాటక కలుపుకొని దాదాపు 23 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. టోటల్ గా ఇవాల్టికి 30.1 cr గ్రాస్ కలెక్ట్ చేసింది. సినిమాకి ఇంకా పటెన్షియల్ ఉందని నమ్ముతున్నాము. దసరా సెలవుల్లో కూడా ఈ రన్ కంటిన్యూ అవుతుందని భావిస్తున్నాము. టీం అంతా చాలా ఆనందంగా ఉన్నాం. ఇదే ఇదే ఉత్సాహంతో మత్తు వదలరా3 బ్రహ్మాండంగా చేస్తామని మాటిస్తున్నాం. శ్రీ సింహ, సత్య, ఫారియా సినిమాకి పని చేసిన అందరికీ పేరుపేరు థాంక్ యూ’ అన్నారు.