అశోక్ గల్లా హీరోగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న చిత్రం పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభం

0
57
Namrata Ghattamaneni - Ashok Galla - Sri Gouri Priya - Sithara Entertainments #27
Namrata Ghattamaneni - Ashok Galla - Sri Gouri Priya - Sithara Entertainments #27
అశోక్ గల్లా హీరోగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న చిత్రం పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభం
ఒక వైపు అగ్ర కథానాయకులతో భారీ చిత్రాలు చేస్తూనే, మరోవైపు యువ ప్రతిభను ప్రోత్సహిస్తూ వైవిధ్యమైన చిత్రాలను నిర్మిస్తున్న ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ తాజాగా మరో కొత్త చిత్రాన్ని ప్రారంభించింది. ప్రతిభావంతుడైన యువ నటుడు అశోక్ గల్లా కథానాయకుడిగా ప్రొడక్షన్ నెం.27 చిత్రం పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది.
సినీ ప్రముఖల సమక్షంలో చిత్ర ప్రారంభోత్సవం ఎంతో వైభవంగా జరిగింది. నమ్రత ఘట్టమనేని ఫస్ట్ క్లాప్ ఇవ్వగా, పద్మ గల్లా మరియు మంజుల స్వరూప్ తమ చేతుల మీదుగా స్క్రిప్ట్‌ని చిత్ర బృందానికి అందజేశారు. చిత్రం ఘన విజయం సాధించాలని కోరుకుంటూ చిత్ర బృందానికి అతిథులు శుభాకాంక్షలు తెలిపారు.
రొమాంటిక్ కామెడీ డ్రామాగా రూపొందుతోన్న ఈ చిత్రంలో అశోక్ గల్లాతో పాటు ‘మ్యాడ్’ ఫేమ్ శ్రీ గౌరీ ప్రియ, ‘కోట బొమ్మాళి పి.ఎస్’ ఫేమ్ రాహుల్ విజయ్, శివాత్మిక ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
అమెరికా నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్రానికి యువ దర్శకుడు ఉద్భవ్ రచన, దర్శకత్వం వహిస్తున్నారు. సెప్టెంబర్ నెలాఖరు నుంచి చిత్ర బృందం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించనుంది.
ఈ చిత్రంలో కడుపుబ్బా నవ్వించే హాస్యంతో పాటు, హృదయాన్ని హత్తుకునే డ్రామా ఉంటుందని.. ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుందని నిర్మాతలు తెలిపారు.
ప్రతిభగల ఛాయాగ్రాహకుడు భరద్వాజ్ ఆర్ కెమెరా బాధ్యతలు నిర్వహించనున్నారు.
సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ఫోర్ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మరిన్ని వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.
తారాగణం: అశోక్ గల్లా, శ్రీ గౌరీ ప్రియా, రాహుల్ విజయ్, శివాత్మిక
సాంకేతిక సిబ్బంది
రచన, దర్శకత్వం: ఉద్భవ్
ఛాయాగ్రాహకుడు: భరద్వాజ్ ఆర్
నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య
బ్యానర్స్: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ఫోర్ సినిమాస్‌

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here