విక్టరీ వెంకటేష్ అనిల్ రావిపూడి #VenkyAnil3 – #SVC58 సెట్స్‌లో నటసింహం నందమూరి బాలకృష్ణ

0
49
Nandamuri Balakrishna - Victory Venkatesh - #SVC58 - #VenkyAnil3
Nandamuri Balakrishna - Victory Venkatesh - #SVC58 - #VenkyAnil3

విక్టరీ వెంకటేష్, బ్లాక్ బస్టర్ హిట్ మెషిన్ అనిల్ రావిపూడి, దిల్ రాజు, శిరీష్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ప్రొడక్షన్ నెం 58 సెట్స్‌లో నటసింహం నందమూరి బాలకృష్ణ

విక్టరీ వెంకటేష్, బ్లాక్‌బస్టర్ మెషిన్ అనిల్ రావిపూడి, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ల సెన్సేషనల్ కాంబినేషన్‌లో క్రేజీ ఎంటర్‌టైనర్ #వెంకీఅనిల్03 పొల్లాచ్చిలో లెన్తీ, క్రూసియల్ షెడ్యూల్‌ను పూర్తయిన తర్వాత, ప్రస్తుతం హైదరాబాద్‌లోని RFCలో న్యూ షూటింగ్ షెడ్యూల్‌తో జరుగుతోంది. వెంకటేష్‌తో పాటు ప్రముఖులు నటీనటులు షూటింగ్‌లో పాల్గొంటున్నారు.

తాజాగా ఈ సెట్స్‌ లోకి ప్రత్యేక అతిథి వచ్చారు. RFCలో లేటెస్ట్ షెడ్యూల్‌లో నటసింహం నందమూరి బాలకృష్ణ #వెంకీఅనిల్3 సెట్స్‌ లో సందడి చేశారు. ఈ ఆన్-లొకేషన్ స్టిల్స్‌లో బాలకృష్ణ, వెంకటేష్, అనిల్ రావిపూడి మధ్య సోదరభావం చూడటం డిలైట్ ఫుల్ గా వుంది. బాలయ్య రాకతో టీం చాలా థ్రిల్‌ అయ్యింది. బాలకృష్ణ, వెంకటేష్ మంచి స్నేహితులు. అనిల్ రావిపూడి NBK ఆల్-టైమ్ హిట్ భగవంత్ కేసరిని రూపొందించారు, ఈ మూవీ SIIMAలో ఉత్తమ చిత్రం అవార్డును గెలుచుకుంది.

ఈ చిత్రంలో వెంకటేష్ భార్యగా ఐశ్వర్య రాజేష్ నటిస్తుండగా, మీనాక్షి చౌదరి ఎక్స్ లవర్ గా కనిపించనుంది. ఈ ట్రై యాంగిల్ క్రైమ్ డ్రామా ని దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్నారు.

టాప్ టెక్నిషియన్స్ ఈ సినిమా కోసం పని చేస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించగా, సమీర్ రెడ్డి సినిమాటోగ్రాఫర్. ఎఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్, తమ్మిరాజు ఎడిటర్. ఎస్ కృష్ణ, జి ఆదినారాయణ కో -రైటర్స్. వి వెంకట్ యాక్షన్ డైరెక్టర్.

#వెంకీఅనిల్03ని 2025 సంక్రాంతి సందర్భంగా విడుదల చేయడానికి సన్నహాలు చేస్తున్నారు.

నటీనటులు: వెంకటేష్, మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్, ఉపేంద్ర లిమాయే, రాజేంద్ర ప్రసాద్, సాయి కుమార్, నరేష్, VT గణేష్, మురళీధర్ గౌడ్, పమ్మి సాయి, సాయి శ్రీనివాస్, ఆనంద్ రాజ్, చైతన్య జొన్నలగడ్డ, మహేష్ బాలరాజ్, ప్రదీప్ కాబ్రా, చిట్టి

సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: అనిల్ రావిపూడి
సమర్పణ: దిల్ రాజు
బ్యానర్: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
నిర్మాత: శిరీష్
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
డీవోపీ: సమీర్ రెడ్డి
ప్రొడక్షన్ డిజైనర్: A S ప్రకాష్
ఎడిటర్: తమ్మిరాజు
కో- రైటర్స్: ఎస్ కృష్ణ, జి ఆదినారాయణ
యాక్షన్ డైరెక్టర్: వి వెంకట్
VFX: నరేంద్ర లోగిసా
పీఆర్వో: వంశీ-శేఖర్

Nandamuri BalaKrishna At #SVC58 #VenkyAnil3 - Anil Ravipudi- Victory Venkatesh
Nandamuri BalaKrishna At #SVC58 #VenkyAnil3 – Anil Ravipudi- Victory Venkatesh

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here