‘100 డ్రీమ్స్’ ఫౌండేషన్ – హీరో కృష్ణ మానినేని ఏపీ సీఎం సహాయనిధికి రూ.10 లక్షల విరాళం

0
37
Pawan Kalyan Appreciates Jetty Hero Krishna Manineni, The 100 Dreams Founder Donates To Flood Relief Efforts In AP
Pawan Kalyan Appreciates Jetty Hero Krishna Manineni, The 100 Dreams Founder Donates To Flood Relief Efforts In AP

వరద బాధితుల సహాయార్ధం ఏపీ సీఎం సహాయనిధికి రూ.10 లక్షల విరాళం అందించిన హీరో కృష్ణ మానినేని- ‘100 డ్రీమ్స్’ ఫౌండేషన్ సేవలని ప్రశంసించిన ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు

మొదటి సినిమా ”జెట్టి” తోనే తన నటనతో హీరోగా మంచి పేరు సంపాదించుకున్న కృష్ణ మానినేని ‘100 డ్రీమ్స్’ ఫౌండేషన్ పేరిట గత 8 సంవత్సరాలుగా అనేక సామజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా విజయవాడలో సంభవించిన అకాల వర్షాలకు బుడమేరుకు గండ్లు పడి విజయవాడ నగరాన్ని వరద ముంచెత్తి వేలాది మంది ప్రజలు నిరాశ్రయులైన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలోనే 100 డ్రీమ్స్ ఫౌండేషన్ ఫౌండర్ కృష్ణ మానినేని, టీం విజయవాడలోని వరద బాధిత ప్రాంతాలలోని ప్రజలను అనేక విధాలుగా ఆదుకోవడం జరిగింది. ఈ విషయం కాస్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి దృష్టికి రావడంతో ఆయన స్వయంగా 100 డ్రీమ్స్ ఫౌండర్ని ఆహ్వానించడం జరిగింది.

వరద బాధితుల సహాయార్ధం హీరో కృష్ణ మానినేని, ఏపీ సీఎం సహాయనిధికి రూ.10 లక్షల విరాళాన్ని చెక్ రూపంలో డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారికి అందజేశారు.

ఆ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారిని కలిసిన హీరో కృష్ణ మానినేని మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ గారు ఎంతో ఆత్మీయంగా పలకరించిన తీరు చాలా సంతోషాన్ని కలిగించింది. ‘100 డ్రీమ్స్’ ఫౌండేషన్ చేస్తున్న సేవ కార్యక్రమాలని ఆయన శ్రద్ధగా విని, మా ప్రయత్నాలను ప్రశంసించి భవిష్యత్తులో మరిన్ని మంచి కార్యక్రమాలను చేపట్టాలని ఆశీర్వదించారు. ఇంత బిజీ సమయంలో కూడా మమ్మల్ని పిలిచి అభినందించిన పవన్ కళ్యాణ్ గారికి జీవితాంతం రుణపడిఉంటాం’ అని తెలిపారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here