ఉత్సవం రివ్యూ

0
166
Utsavam Movie Review
Utsavam Movie Review

ఉత్సవం రివ్యూ

కథ :

సురభి నాటక పరిషత్ లో కళాకారుడు అయిన అభిమన్యు నారాయణ(ప్రకాష్ రాజ్) ఎలా అయినా కొడుకు కృష్ణ(దిలీప్ ప్రకాష్)ను ఏదో ఒక ఉద్యోగంలో సెట్ చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అతనికి ఉద్యోగం.వచ్చిన విషయం తెలిసి తన తోటి కళాకారుడు సహదేవ్(నాజర్) కూతురు రమ(రెజీనా కసాండ్రా)తో పెళ్ళి ఫిక్స్ చేస్తారు. అయితే పెళ్లి కాసేపట్లో ఉందనగా రమ, కృష్ణ ఇద్దరూ ఒకరికొకరికి తెలియకుండానే పారిపోతారు. తల్లి తండ్రులకి తెలియక ముందే ప్రేమించుకున్న రమ, కృష్ణలే పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు అని తెలియకుండానే పెళ్ళిపీటల వరకు వెళ్ళగా పెళ్లి జరిగే సమయానికి రమ, కృష్ణ ఇద్దరూ పెళ్లి వెళ్లిపోతారు. అయితే మరి రమ కృష్ణలే పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు అని వాళ్లకు తెలిసిందా? వీళ్లిద్దరు వెళ్లిపోవడంతో ఆ కుటుంబాలు ఏం చేసాయి?నాటకాలకు పూర్వ వైభవం తీసుకు వచ్చేందుకు కృష్ణ ఏం చేశాడు? అనేది తెలియాలంటే బిగ్ స్క్రీన్ మీద సినిమా చూడాల్సిందే.

నటీనటుల విషయానికి వస్తే

కన్నడలో ఇప్పటికే ఒక సినిమా చేసిన దిలీప్ ప్రకాష్ ఈ సినిమాలో కృష్ణ అనే పాత్రలో అద్భుతమైన నటన కనబరిచాడు. ఎమోషనల్ సీన్స్ లో కూడా నటనలో పరిణితి కనిపించింది. యాక్షన్ సీన్స్ లో ఇరగదీశాడు. ఇక రెజీనా కాసాండ్రా అందంగా కనిపిస్తూనే నటనలో ఆకట్టుకుంది. ఇక నాజర్, ప్రకాష్ రాజ్, రఘుబాబు, అలీ , బ్రహ్మానందం ఇలా ఒకరికి మించి ఒకరు తమదైన శైలిలో నటించి మెప్పించారు. అయితే సినిమా టెక్నికల్ టీం విషయానికి వస్తే దర్శకుడిగా అర్జున్ సాయికి మొదటి సినిమానే అయినా ఒక మంచి పాయింట్ ను ఎంచుకున్నాడు. అయితే డీల్ చేసిన విధానం విషయంలో కేర్ తీసుకుని ఉంటే బాగుండేది. అయితే మొదటి ప్రయత్నంలోనే ఇలాంటి సినిమా ఎంచుకోవడం ఒక సాహసం. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ఈ సినిమా కోసం ఆర్ట్ డిపార్ట్మెంట్ కష్టం కనిపించింది. అనూప్ రూబెన్స్ పాటలు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగున్నాయి. దర్శకుడిగా అంతమంది స్టార్ క్యాస్ట్ ని ఒకేచోట డీల్ చేయడంలో అర్జున్ సాయి సక్సెస్ అయ్యాడు. నిర్మాణ విలువలు బాగున్నాయి.

విశ్లేషణ

ఉత్సవం సినిమాని అంతరించిపోతున్న నాటకాల గురించి, చర్చించే కథ అంటూ ప్రమోట్ చేశారు కానీ సినిమాలో ప్రేమ కథనే తీసుకుని దాని చుట్టూ సురభి నాటకాల ప్రస్తావన వచ్చేలా కథ రాసుకున్నాడు. ఫస్ట్ హాఫ్ హీరో – హీరోయిన్ మధ్య ప్రేమ కథతో మొదలై సెకండ్ హాఫ్ హీరో – హీరోయిన్ మధ్య సన్నివేశాలతో పాటు నాటకాలకు పూర్వ వైభవం ఎలా తీసుకొచ్చారు అనే పాయింట్స్ చుట్టూ సాగుతుంది. నిజానికి హీరో – హీరోయిన్ ఒకరికొకరు తెలియకుండా ఇష్టపడటం, వాళ్ళిద్దరికే పెళ్లి అని తెలియకుండా కలిసి తిరగడం, గొడవ పడడం లాంటి పాయింట్స్ తో గతంలో శశిరేఖ పరిణయం లాంటి సినిమాలు చూసాం. నాటకాల ప్రస్తావనతో కృష్ణం వందే జగద్గురుమ్, రంగమార్తాండ సినిమాలు కూడా డిస్కస్ చేశాయి. అయితే ఆ రెండిటి కలయికతో ఈ సినిమా ఒక ఆసక్తికరమైన ఫ్యూజన్ల అనిపించింది.. ఒక క్యూట్ లవ్ స్టోరీ తో పాటు నాటకాల వాసన చూపిస్తూనే ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకువెళ్లే ప్రయత్నం చేశారు.. నిజానికి ఇలాంటి కథలు చాలా తక్కువగా ప్రేక్షకులు ముందుకు వస్తాయి.. ఇలాంటి కథను ఎంచుకోవడమే ముందుగా హీరో హీరోయిన్లు చేసిన సాహసం అని చెప్పొచ్చు.

ఫైనల్లీ

ఈ ఉత్సవం ఒక సరికొత్త అనుభూతిని ఇచ్చే సినిమా.

రేటింగ్

3/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here