కార్తీ, అరవింద్ స్వామి, సి ప్రేమ్ కుమార్, సూర్య, జ్యోతిక, 2డి ఎంటర్‌టైన్‌మెంట్, ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ‘సత్యం సుందరం’ హ్యుమరస్ & హార్ట్ వార్మింగ్ టీజర్ రిలీజ్

0
69
Sathyam Sundaram Humorous & Heartwarming Teaser Unveiled
Sathyam Sundaram Humorous & Heartwarming Teaser Unveiled

కార్తీ, అరవింద్ స్వామి, సి ప్రేమ్ కుమార్, సూర్య, జ్యోతిక, 2డి ఎంటర్‌టైన్‌మెంట్, ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ‘సత్యం సుందరం’ హ్యుమరస్ & హార్ట్ వార్మింగ్ టీజర్ రిలీజ్

హీరో కార్తీ, అరవింద్ స్వామి లీడ్ రోల్స్ లో రాబోతున్న హోల్సమ్ ఎంటర్‌టైనర్ సత్యం సుందరం. 96 ఫేమ్ సి ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. 2డి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై సూర్య, జ్యోతిక నిర్మిస్తున్నారు. టీజర్‌ని విడుదల చేసి మేకర్స్ ప్రమోషన్స్ ప్రారంభించారు.

ఈ టీజర్ కార్తీ, అరవింద్ స్వామి రెండు వరల్డ్స్ ని ప్రజెంట్ చేసింది, వారి ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీని హైలైట్ గా వుంది. వీరిద్దరు డిఫరెంట్ లైఫ్ స్టయిల్ లో ఆకట్టుకున్నారు. కార్తీ అమాయకత్వంతో కూడిన రస్టిక్ క్యారెక్టర్ చేస్తే, అరవింద్ స్వామి రిజర్వ్‌డ్, అర్బన్ పర్సనాలిటీ గా కనిపించారు.

96లో డ్రామాని డీల్ చేయడంలో తన సత్తా చాటిన సి ప్రేమ్ కుమార్ లీడ్ రోల్స్ ని అద్భుతంగా ప్రజెంట్ చేశాడు. కార్తీ, అరవింద్ స్వామి డిఫరెంట్ రోల్స్ లో మ్యాజిక్ క్రియేట్ చేసారు. ఈ టీజర్  గ్రేట్ ఇంపాక్ట్ ని క్రియేట్ చేసింది.

ఈ సినిమాలో శ్రీ దివ్య, స్వాతి కొండే, దేవదర్శిని ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

మహేంద్రన్ జయరాజు కెమెరా పనితనం అద్భుతంగా ఉంది,  గోవింద్ వసంత బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఎమోషన్ ని ఎలివేట్ చేసింది. ఈ చిత్రానికి ఆర్‌ గోవింద్‌రాజ్‌ ఎడిటర్. సత్యం సుందరం హ్యుమరస్ అండ్ హార్ట్ వార్మింగ్ మూవీని టీజర్ ప్రామిస్ చేస్తోంది.

ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. సత్యం సుందరం సెప్టెంబర్ 28న విడుదల కానుంది.

తారాగణం: కార్తీ, అరవింద్ స్వామి, శ్రీ దివ్య, స్వాతి కొండే, దేవదర్శిని

సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: సి ప్రేమ్ కుమార్
నిర్మాతలు: సూర్య, కార్తీ
బ్యానర్: 2డి ఎంటర్‌టైన్‌మెంట్
తెలుగు రిలీజ్: ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్
సంగీతం: గోవింద్ వసంత
డీవోపీ: మహేందిరన్ జయరాజు
ఎడిటర్: ఆర్ గోవింద్‌రాజ్
పీఆర్వో: వంశీ-శేఖర్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here