“ సింబా” మూవీ రివ్యూ

0
210

చిత్రం: సింబా
బ్యానర్: సంపత్ నంది టీం వర్క్స్, రాజ్ దాసరి ప్రొడక్షన్స్
రిలీజ్ డేట్: 2024-08-09
CBFC రేటింగ్: UA
నిడివి: 2 గం 5 నిమిషాలు
నటీనటులు: అనసూయ, జగపతిబాబు, కబీర్ సింగ్, దివి, శ్రీనాథ్, వశిష్ట సింహ, కస్తూరి, అనీష్ కురువిళ్ళ.. తదితరులు
నిర్మాత: దాసరి రాజేందర్ రెడ్డి, సంపత్ నంది
రచన, దర్శకత్వం: మురళి మోహన్ రెడ్డి

సంపత్ నంది టీం వర్క్స్, రాజ్ దాసరి ప్రొడక్షన్స్ బ్యానర్ల మీద సంపత్ నంది, దాసరి రాజేందర రెడ్డి నిర్మాణంలో తెరకెక్కిన సినిమా సింబా. అనసూయ, జగపతి బాబు, వశిష్ట సింహ ప్రధాన పాత్రల్లో ఈ ‘సింబా’ సినిమాని మురళీ మనోహర్ రెడ్డి తెరకెక్కించాడు. సింబా సినిమా నేడు ఆగస్ట్ 9న థియేటర్స్ లో రిలీజయింది.

కథ :

అక్ష(అనసూయ) ఒక టీచర్. తన భర్తకు యాక్సిడెంట్ లో కాళ్ళు పోవడంతో తనే ఇంటిని పోషిస్తుంది. ఒకరోజు రోడ్డు మీద ఒక వ్యక్తిని చూడగానే అనసూయ అతన్ని ఫాలో అయి వెళ్లి చంపేస్తుంది. ఈ మర్డర్ కేసుని పోలీసాఫీసర్ అనురాగ్(వశిష్ఠ సింహ), జర్నలిస్ట్ ఫాజిల్(శ్రీనాథ్) ఇన్వెస్టిగేట్ చేస్తుంటారు. ఒక రోజు ఫ్యామిలీతో అక్ష, లవర్ ఇష్ట(దివి)తో ఫాజిల్, అనురాగ్ కేసు విచారణ కోసం ఒక ప్లేస్ కి వస్తారు. అక్కడ కూడా ఒక వ్యక్తిని చూడగానే అక్షతో పాటు ఫాజిల్ కూడా వెళ్లి అతన్ని చంపేస్తారు. అనురాగ్ అక్ష, ఫాజిల్ ని అరెస్ట్ చేస్తాడు. చనిపోయిన ఇద్దరూ పార్థ(కబీర్ సింగ్) మనుషులు కావడంతో వీళ్ళిద్దర్నీ చంపేయాలని అనురాగ్ ని కేసు నుంచి తప్పించి పార్థ తమ్ముడు, అతని మనుషులు అక్ష, ఫాజిల్ ని కోర్టుకు తీసుకెళ్తుండగా వారిపై అటాక్ చేస్తారు. కానీ అక్ష, ఫాజిల్ తో పాటు డాక్టర్ ఇరానీ(అనీష్ కురువిళ్ళ) కూడా వచ్చి పార్థ తమ్ముడ్ని చంపేస్తారు. అసలు ఈ ముగ్గురు ఎందుకు పార్థ మనుషులను చంపుతున్నారు? అనురాగ్ ఈ కేసుని ఎలా సాల్వ్ చేసాడు? ఫారెస్ట్ మ్యాన్ సింబా అలియాస్ పురుషోత్తం రెడ్డి(జగపతిబాబు)కి ఈ ముగ్గురికి సంబంధం ఏంటి తెలియాలంటే తెరపై చూడాల్సిందే.

నటీనటుల పర్ఫార్మెన్స్.. అనసూయ ఓ పక్క టీచర్ గా, మరో పక్క యాక్షన్ సీన్స్ లో బాగా నటించింది. వసిష్ఠ సింహ పోలీసాఫీసర్ పాత్రలో అదరగొట్టేసాడు. శ్రీనాథ్ కూడా మెప్పించాడు. జగపతి బాబు పర్యావరణ ప్రేమికుడిగా అందర్నీ ఆకట్టుకున్నాడు. దివి, అనీష్ కురువిళ్ళ, కస్తూరి.. మిగిలిన నటీనటులు కూడా వారి పాత్రల పరిధి మేరకు మెప్పించారు.

విశ్లేషణ :

సింబా సినిమాలో సెల్యులర్ మెమరీ, బయోలజికల్ మెమరీ అనే ఓ కొత్త కాన్సెప్ట్ ని ఆసక్తిగా చూపిస్తూనే మొక్కలు నాటాలి, చెట్లను పెంచాలి అని ఒక మంచి మెసేజ్ ఇచ్చారు. అయితే ఈ కొత్త కాన్సెప్ట్, మెసేజ్ రెండూ కూడా కమర్షియల్ పాయింట్ లో చక్కగా చూపించారు. ఫస్ట్ హాఫ్ అనసూయ, ఫాజిల్ ఇలా ఎందుకు చంపుతున్నారు అని ఆసక్తిగా సాగుతుంది. ఇంటర్వెల్ కి సెకండ్ హాఫ్ లో అసలు వీళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారు అనే క్యూరియాసిటీ పెరుగుతుంది. సెకండ్ హాఫ్ లో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఉంటుంది. అయితే సెకండ్ హాఫ్ కొంచెం సాగదీసినట్టు అనిపిస్తుంది. ఓ పక్క పర్యావరణం గురించి మంచి మెసేజ్ ఇస్తూనే మరో పక్క సెల్యులర్ మెమరీ అంటూ థ్రిల్లింగ్ కథని బాగానే తెరకెక్కించారు.

సాంకేతిక నిపుణుల పనితీరు :

నిర్మాతలు రాజేందర్ రెడ్డి, సంపత్ నంది సినిమాకు తగ్గట్టు బాగానే ఖర్చుపెట్టారు. కథ, మాటలు ఈ సినిమాకి సంపత్ నంది అందించారు. ఇలాంటి కొత్త కాన్సెప్ట్ ని రాయడం సంపత్ నందికి ఇదే మొదటిసారి అయినా బాగా రాసుకున్నారు. ఇక కొత్త దర్శకుడు మురళి మనోహర్ తనకిచ్చిన కథని సక్సెస్ ఫుల్ గా సినిమా రూపంలో మలిచాడు. సంగీత దర్శకుడు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం బాగా ఇచ్చాడు. సినిమాటోగ్రఫీ విజువల్స్ పర్వాలేదనిపిస్తాయి. ఎడిటింగ్ వర్క్ కూడా బాగుంది.

రేటింగ్ : 3/5

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here