నటీనటులు – విజయ్ శంకర్, విషిక, బ్రహ్మాజి, షకలక శంకర్, ప్రశాంత్ కూఛిబొట్ల, అనూహ్య సారిపల్లి, ఆద్విక్ బండారు, తదితరులు
టెక్నికల్ టీమ్ – ఎడిటింగ్,
డీఐ – శ్యామ్ కుమార్.పి.,
సినిమాటోగ్రఫీ – నవధీర్,
మ్యూజిక్ – ప్రవీణ్ సంగడాల,
బ్యానర్ – శివత్రి ఫిలింస్,
నిర్మాత – పడ్డాన మన్మథరావు,
రచన, దర్శకత్వం – రాజేశ్ ముదునూరి
తెలుగు సినిమాల్లో లవ్ స్టోరీలు నెవర్ ఎండింగ్. ఈ సినిమాలు ఎన్ని వచ్చినా ఆకట్టుకునే కథతో పాటు నటీనటులు కూడా ఉంటే ఆ సినిమా హిట్ అని ప్రేమలు లాంటి సినిమాలు నిరూపించాయి. ఈ క్రమంలోనే ఈ రోజు థియేటర్స్ లోకి లవ్ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా పాగల్ వర్సెస్ కాదల్ అనే సినిమా వచ్చింది. ఇదేం టైటిల్ అని ఒక్కసారిగా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది ఈ సినిమా. అయితే థియేటర్స్ లోకి వచ్చేసిన ఈ పాగల్ వర్సెస్ కాదల్ సినిమా ఏ మేరకు ప్రేక్షకులను ఆకట్టుకుందో రివ్యూలో చూద్దాం.
కథేంటంటే;
ఒక వ్యక్తి తాగి న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నాడనే కంప్లైంట్ తో అదేమిటో చూద్దామని దగ్గరకు వెళ్తారు పోలీస్ కానిస్టేబుల్ రామ్ ప్రసాద్ (షకలక శంకర్), ఎస్ఐ (బ్రహ్మాజీ). ప్రసాద్ అనే సదరు వ్యక్తి ఎందుకు అలా చేస్తున్నాడు అని అడిగితే తన సంగతి పక్కన పెట్టేసి తన ఫ్రెండ్ స్టోరీ చెప్పడం మొదలుపెట్టి ఆ ఫ్రెండ్ పేరు కార్తీక్ (విజయ్ శంకర్) అని సివిల్ ఇంజినీర్ గా పనిచేస్తుంటాడని చెబుతాడు. ప్రియ (విషిక) అనే అమ్మాయిని చూసి లవ్ చేస్తాడు కానీ విషిక సైకోలా బిహేవ్ చేస్తుంటుందనీ కార్తీక్ తనను ఎంతగా ప్రేమిస్తున్నాడో తెలుసుకునేందుకు టెస్ట్ లు చేస్తుంటుందని చెబుతాడు. ఆమె మీద ప్రేమతో ప్రియ చేసే పనులన్నీ భరిస్తూ ఆమెను కార్తీక్ వదులుకోడు. ప్రియ బ్రదర్ మనోజ్ ఒక సైకియాట్రిస్ట్, అతన్ని లవ్ చేస్తుంది కార్తీక్ సోదరి అమృత. కానీ అమృత లవ్ ను మనోజ్ ఒప్పుకోడు ఎందుకంటే అతనిది కూడా ఒక సైకో మైండ్ సెట్. తనే అందరికన్నా గొప్పవాడని ఫీలయ్యే మనోజ్. అమాయకుడు కార్తీక్, అతని సోదరి అమృత, సైకో మైండ్ సెట్ ఉన్న ప్రియ, మనోజ్ ప్రేమలో ఎలా ఒక్కటయ్యారు అనేది ఈ సినిమా కథ.
కార్తీక్ పాత్రలో విజయ్ శంకర్ పర్ ఫార్మెన్స్ హైలైట్. ఇన్నోసెంట్ కుర్రాడిగా, ప్రేయసి ఎన్ని బాధలు పెట్టినా ప్రేమతో భరించే పాత్రలో ఆకట్టుకునేలా నటించాడు. ప్రియ పాత్రలో విషిక సైకోయిజాన్ని పీక్స్ లో చూపించి ఆఖరికి చేతబడి కూడా నేర్చుకోవడం హైలైట్. అమృతగా అనూహ్య సారిపల్లి చెల్లి అంటే ఇలాగే ఉంటుందా అనిపించేలా నటించాడు. శాడిస్ట్ సైకియాట్రిస్ట్ గా మనోజ్ పాత్రలో ఒదిగిపోయాడు ప్రశాంత్. కార్తీక్ ఫ్రెండ్ ప్రసాద్ g కమెడియన్ సునీల్ క్యారెక్టర్ లా మూవీ అంతా ఎంటర్ టైన్ చేసేలా ఉంది
విశ్లేషణ
మంచి కంటెంట్ ఇవ్వాలే కానీ యూత్ ఫుల్ లవ్ స్టోరీస్ చూసేందుకు ప్రేక్షకుల ఎప్పుడూ రెడీగా ఉంటారు. వారికి కావాల్సిందల్లా కాసేపు ఎంటర్ టైన్ చేయడమే అని చెప్పొచ్చు. ప్రేమ కథ ఎలా ఉన్నా కాస్త కెమిస్ట్రీ అలాగే వినోదాన్ని అందిస్తే చాలు హిట్ అయినట్లే. అలాంటి ఎంటర్ టైన్ మెంట్ ను పాగల్ వర్సెస్ కాదల్ లో గట్టిగా ఉండేలా చూసుకున్నాడు డైరెక్టర్. ఈ కథలోని కార్తీక్, ప్రియ, అమృత, మనోజ్ అనే నాలుగు మెయిన్ క్యారెక్టర్స్ ను భిన్నంగా డిజైన్ చేశాడు దర్శకుడు. ఆ క్యారెక్టర్స్ లోని కొత్తదనమే సినిమాను ప్రేక్షకులు ఎంజాయ్ చేసేలా చేసింది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ప్రేమ కథల్లో ఇది ఒక భిన్నమైన అటెంప్ట్. ఇవాళ్టి జనరేషన్ లవర్స్ బాగా కనెక్ట్ అయ్యేలా చేయడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. ప్రేమకు నమ్మకం ఉండాలి కానీ అనుమానం కాదు అది ఉంటే జీవితం నరకమే అనే పాయింట్ డిస్కస్ చేశారు.
సాంకేతిక నిపుణుల పనితీరు
ప్రవీణ్ మ్యూజిక్ బాగుంది. బీజీఎం కూడా స్పెషల్ అట్రాక్షన్. సైకో సైకస్య సైకోభ్యహా అనే హుక్ లైన్ తో వచ్చే బీజీఎం అయితే అదిరిపోయింది. దర్శకుడు రాజేశ్ ముదునూరి పెళ్లి చూపులు టైమ్ ఒక హిలేరియస్ లవ్ అండ్ ఎంటర్ టైనర్ మూవీ చేశాడు. నిర్మాణ విలువలు బాగున్నాయి. సినిమాటోగ్రఫీ కూడా సినిమా మూడ్ సెట్ చేసేలా ఉంది.
రేటింగ్ 3/5
చివరిగా: పాగల్ వర్సెస్ కాదల్ ఫన్ రైడ్.. లవ్ లో సైకోయిజాన్ని ఫీలైన వాళ్ళు బాగా కనెక్ట్ అవుతారు.