‘మిస్టర్ బచ్చన్’లో బ్యూటీఫుల్ క్యారెక్టర్ చేశాను.ఆడియన్స్ సినిమాని చాలా ఎంజాయ్ చేస్తారు: హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే

0
46

‘మిస్టర్ బచ్చన్’లో బ్యూటీఫుల్ క్యారెక్టర్ చేశాను. సాంగ్స్, డ్యాన్స్ మూమెంట్స్ కి గ్రేట్ రెస్పాన్స్ రావడం హ్యాపీగా వుంది. ఆడియన్స్ సినిమాని చాలా ఎంజాయ్ చేస్తారు: హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే

మాస్ మహారాజా రవితేజ, మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ హైలీ యాంటిసిపేటెడ్ మూవీ ‘మిస్టర్ బచ్చన్’ అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ తో హ్యుజ్ బజ్ క్రియేట్ చేస్తోంది. ప్రతిష్టాత్మకమైన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై అత్యద్భుతమైన గ్రాండియర్‌తో నిర్మాత టి.జి.విశ్వ ప్రసాద్ ఈ సినిమాని నిర్మించారు. ఇందులో రవితేజకు జోడిగా భాగ్యశ్రీ బోర్సే నటించింది. మిస్టర్ బచ్చన్ ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం రోజున విడుదల కానుంది. ఈ నేపధ్యంలో హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలని పంచుకున్నారు.
మీకు సినిమాలపై ఇంట్రస్ట్ ఎప్పుడు ఏర్పడింది ? మిస్టర్ బచ్చన్ ప్రాజెక్ట్ లోకి ఎలా వచ్చారు ?
-మాది ఔరంగాబాద్, మహారాష్ట్ర. మా నాన్నగారు ఉద్యోగ రిత్యా లాగోస్(నైజీరియా) షిఫ్ట్ అయ్యారు. అక్కడే నా స్కూలింగ్ జరిగింది. బిజినెస్ మ్యానెజ్మెంట్ కోసం ముంబై వచ్చాను. గ్రాడ్యువేషన్ లో ఉండగా చాలా మంది మోడలింగ్ చేయమని ప్రోత్సహించారు. ఆ ఫీల్డ్ లోకి అడుగుపెట్టిన తర్వాత చాలా నచ్చింది. కెమరా భయం పోయింది. కొన్ని కమర్షియల్స్ చేశాను.
-మంచి అవకాశం ఎదురుచూస్తున్నప్పుడు మిస్టర్ బచ్చన్ అవకాశం వచ్చింది. హైదరాబద్ కి వచ్చి ఆడిషన్ ఇచ్చాను. నా ఆడిషన్ మేకర్స్ కి నచ్చింది. జిక్కీ పాత్రకు నేను పర్ఫెక్ట్ అని సెలెక్ట్ చేశారు. తర్వాత లుక్ టెస్ట్ కోసం వచ్చినపుడు రవితేజ గారిని కలిశాను.
మీ మొదటి సినిమాతోనే మాస్ మహారాజా రవితేజ గారితో నటించే అవకాశం వచ్చింది కదా.. ఆయన ఎనర్జీ మ్యాచ్ చేయగలిగారా ?
– నేను ఏదైనా చేసినప్పుడు హండ్రెడ్ పెర్సెంట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. హార్డ్ వర్క్ చేయడానికి సిద్ధంగా వుంటాను. రవితేజ గారితో వర్క్ చేయడం చాలా ఎక్సయిటింగా అనిపించింది. రవితేజ గారు ఛార్మింగ్ పర్సనాలిటీ.
ఇందులో మీ పాత్ర ఎలా వుండబోతోంది ?
-ఇందులో నా పాత్ర పేరు జిక్కీ. తను తెలుగు మార్వాడి గర్ల్. తను చాలా క్యూట్, లవబుల్. డైరెక్టర్ గారు ఈ క్యారెక్టర్ ని చాలా బ్యూటీఫుల్ గా తీర్చిదిద్దారు. బచ్చన్ లైఫ్ లో జిక్కీ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సినిమా అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ తో ఆడియన్స్ చాలా ఎంజాయ్ చేసేలా వుంటుంది.
ఇందులో మీ మెమరబుల్ మూమెంట్ ?
-ఇందులో క్యాసెట్ రికార్డింగ్ షాప్ లో ఓ సీన్ వుంటుంది. ఆ సీన్ చేసిన తర్వాత డైరెక్టర్ గారు.. ‘ఐయాం ప్రౌడ్ అఫ్ యూ’ అన్నారు. అది నాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది.
తొలి సినిమాకే తెలుగులో డబ్బింగ్ చెప్పడం ఎలా అనిపించింది ?
-ఇది నా మొదటి తెలుగు సినిమా. నా వాయిస్ ఐతే ఆడియన్స్ మరింత రిలేట్ చేసుకుంటారని డైరెక్టర్ గారిని కోరాను. తెలుగు డబ్బింగ్ చెప్పడం మొదట్లో కాస్త డిఫికల్ట్ అనిపించింది. అయితే డైరెక్షన్ డిపార్ట్మెంట్, టీం చాలా సపోర్ట్ చేసింది. దాదాపు వారం రోజుల్లో డబ్బింగ్ ఫినిష్ చేశాను. చాలా బావొచ్చింది.
షూటింగ్ లో ఎదురుకున్న ఛాలెంజ్ కి పార్ట్ ఏమిటి ?
-నేను నార్త్ అమ్మాయిని. తెలుగు భాషని మొదట్లో అర్ధం చేసుకోవడం కాస్త కష్టం అనిపించింది. ప్రతి డైలాగ్ ని నా మాత్రుభాషకి ట్రాన్స్ లేట్ చేసుకొని అర్ధం చేసుకున్నాను. అయితే కొద్దిరోజుల తర్వాత భాషపై పట్టు సాధించాను. తర్వాత అంత ఈజీ అయ్యింది. తెలుగు భాష చాలా బ్యూటీఫుల్ గా వుంటుంది. పూర్తిగా నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాను.
హరీష్ శంకర్ గారితో వర్క్ చేయడం ఎలా అనిపించింది ?
– హరీష్ గారు చాలా పాషనేట్ డైరెక్టర్. హరీష్ గారితో వర్క్ చేయడం చాలా ఫన్ ఎక్స్ పీరియన్స్. హరీష్ గారు, రవిగారికి ఎంతో అనుభవం వుంది. నేను ‘చందూ చాంపియన్’ లో చిన్న క్యామియో తప్పితే సినిమాలు చేయలేదు. హరీష్ గారు, రవి గారు చాలా సపోర్ట్ చేశారు. వారి సపోర్ట్ తో ఎక్కడా డిఫికల్ట్ ఫీల్ అవ్వలేదు. ప్రతి సీన్ ని ఎంజాయ్ చేస్తూ వర్క్ చేశాం.
రవితేజ గారి నుంచి ఎలాంటి విషయాలు నేర్చుకున్నారు ?
-రవితేజ గారు ఎన్నో సినిమాలు చేశారు. కానీ ఇప్పటికీ ఆయన న్యూకమ్మర్ లానే వుంటారు. సెట్ లో టైంకి వుంటారు. ఎవరికీ ట్రబుల్ ఇవ్వరు. అందరినీ కేరింగ్ గా చూసుకుంటారు. మనం ఏ స్టేజ్ వున్నా మన క్రాఫ్ట్ కి గౌరవం ఇవ్వాలని ఆయన్ని చూసి నేర్చుకున్నాను.
మిక్కీ జే మేయర్ గురించి ?
-మిక్కీ గారు బ్యూటీఫుల్ సాంగ్స్ ఇచ్చారు. రెప్పల్, డప్పుల్, సితార్, జిక్కీ పాటలు చార్ట్ బస్టర్ అయ్యాయి. ఎక్కడా విన్నా ఇవే పాటలు వినిపిస్తున్నాయి. నా మొదటి సినిమాకే ఇంత అద్భుతమైన ఆల్బం రావడం చాలా ఆనందంగా వుంది.
పాటల్లో మీ డ్యాన్స్ మూమెంట్స్ ట్రెండింగ్ లో వున్నాయి ? ఈ రెస్పాన్స్ ఊహించారా ?
నాకు డ్యాన్స్ ఇష్టం. ఫ్రీ టైం లో డ్యాన్స్ చేస్తుంటాను. మొన్న ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి ఆడిటోరియం దద్దరిల్లింది. డ్యాన్స్ మూమెంట్స్ కి ఇంత మంచి రెస్పాన్స్ రావడం చాలా ఆనందంగా వుంది. ఇదొక డ్రీం కం ట్రూ మూమెంట్.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడక్షన్ హౌస్ గురించి ?
-నా మొదటి తెలుగు సినిమా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడక్షన్ లో చేయడం చాలా ఆనందంగా వుంది. వారు చాలా స్వీట్ పీపుల్. చాలా కంఫర్ట్బుల్ గా చూసుకున్నారు. వారితో వర్క్ చేయడం గ్రేట్ ఎక్స్ పీరియన్స్.
మిమ్మల్ని నేషనల్ న్యూ క్రష్ అంటున్నారు ?
థాంక్ యూ. అదొక కాంప్లిమెంట్ లా తీసుకుంటాను. (నవ్వుతూ)
నెక్స్ట్ ప్రాజెక్ట్స్ గురించి ?
-కొన్ని ప్రాజెక్ట్స్ వున్నాయి. మేకర్స్ అనౌన్స్ చేస్తారు.
ఆల్ ది బెస్ట్
-థాంక్ యూ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here