చిత్రం: అనుకున్నవన్నీ జరగవు కొన్ని
విడుదల తేది: 03-11-2023
తారాగణం : శ్రీరామ్ నిమ్మల, కలపాల మౌనిక, పోసాని కృష్ణ మురళి, బబ్లు మాయ్య, కిరీటి, స్నేహ మాధురి, సోనియా చౌదరి, గౌతమ్ రాజు, మిర్చి హేమంత్.
సంగీతం : గిడియన్ కట్ట.
ఎడిటర్ : కె సి బి హరి.
నిర్మాణం: శ్రీ భరత్ ఆర్ట్స్.
నిర్మాత మరియు దర్శకుడు: జి సందీప్.
కథ :
హీరో శ్రీ రామ్ నిమ్మల (కార్తీక్) కాల్ బాయిగా, హీరోయిన్ కలపాల మౌనిక (మధు) కాల్ గర్ల్ గా ఒక కొత్త కాన్సెప్ట్ తో వచ్చిన సినిమా అనుకున్నవన్నీ జరగవు కొన్ని. అసలు కార్తీక్, మధు వాళ్ళ లైఫ్ ని అలా ఎందుకు మలుచుకున్నారు వాళ్ళ లైఫ్ లో జరిగిన అనుకొని సంఘటన వల్ల వాళ్ళు ఎలా ఇరుకునపడ్డారు దాని నుంచి ఎలా బయటకు వచ్చారు అనేది ఈ సినిమా కథాంశం.
నటీనటుల పనితీరు:
హీరో శ్రీరామ్ నిమ్మల మంచి నటనని కనబరిచాడు. హీరోయిన్ కలపాల మౌనిక మొదటిసారి అయినా చాలా బాగా నటించింది. మిగతా నటీనటులు కిరీటి, స్నేహ మాధురి, సోనియా చౌదరి, గౌతమ్ రాజు, మిర్చి హేమంత్ ఎవరికి పాత్రకు వారు న్యాయం చేశారు.
ముఖ్యంగా పోసాని కృష్ణ మురళి నెల్సన్ పాత్రలో చూపించిన విధానం బాగుంది. పోసాని కృష్ణ మురళి, బబ్లు మాయ చేసిన కామెడీ సినిమాకి ప్లస్ పాయింట్స్.
సాంకేతిక నిపుణుల పనితీరు:
నిర్మాతగా దర్శకుడుగా రెండు బాధ్యతలు చేపట్టి అనుకున్న సినిమాని అనుకున్నట్టుగా తీశాడు దర్శకుడు జీ సందీప్. హాస్యాస్పదంగా సాగుతూ క్రైమ్ కామెడీ ఎలిమెంట్స్ తో ఎంటర్టైన్ చేసేలా తెరకెక్కించడంలో దర్శకుడు సఫలం అయినట్టే. గిడియన్ కట్ట అందించిన మ్యూజిక్ చాలా కొత్తగా ఉంది. ఎడిటర్ కె సి బి హరి పనితీరు బాగుంది.
విశ్లేషణ:
హీరోని కాల్ బాయి గా హీరోయిన్ ని కాల్ గర్ల్ గా చూపిస్తూ కొత్త కాన్సెప్ట్ తో వచ్చిన సినిమా. అలాగే సినిమాలో ఒక్క పాట, ఒక్క ఫైట్ లేకుండా తీయడం కూడా కొత్త ప్రయోగమే. సెకండ్ హాఫ్ లో పోసాని కృష్ణమురళి, బబ్లు మాయ యాక్టింగ్ సినిమాకి చాలా పెద్ద ఎసెట్ .దర్శకుడు పోసాని కృష్ణమురళి గారి లాంటి నటుడిని ఉపయోగించుకున్న తీరు అభినందనీయం. ఖర్చుకి వెనకాడకుండా క్వాలిటీ తో చిత్రాన్ని తెరకెక్కించారు. క్రైమ్ మరియు కామెడీని ఎక్కువగా ఇష్టపడే ఎంజాయ్ చేసేలా ఉంది ఈ చిత్రం.
చివరగా: పాట, ఫైట్ లేకుండా తెరకెక్కిన క్రైమ్ కామెడీ ఎంటర్టైనర్
రేటింగ్ : 3/5