ద్రోహి సినిమా రివ్యూ

0
550

చిత్రం: ద్రోహి

విడుదల తేదీ: 03-11-2023

తారాగణం : సందీప్ బొడ్డపాటి, దీప్తి వర్మ, షకలక శంకర్, మజిలీ శివ, మహేష్ విట్ట, డెబ్బి.

సంగీతం : అనంత నారాయణ ఏ. జి

నిర్మాణం: ప్లే వరల్డ్ క్రియేషన్స్, సాఫిరస్ ప్రొడక్షన్స్ ప్రొడక్షన్స్, గుడ్ ఫెల్లోస్ మీడియా సంయుక్తంగా.

నిర్మాతలు: రాజశేఖర్ రవి పూడి, శ్రీకాంత్ రెడ్డి దుగ్గెంపూడి.

దర్శకుడు: విజయ్ దాస్ పెందుర్తి

కథ :

హీరో సందీప్ (అజయ్) తన ఇద్దరి స్నేహితులతో కలిసి బిజినెస్ చేస్తూ ఉంటాడు. చేసే ప్రతి బిజినెస్ ఫెయిల్ అయినా తన భార్య దీప్తి వర్మ (చంద్రిక) తనకు సపోర్టుగా ఉంటుంది. చేసే ప్రతి బిజినెస్ ఫెయిల్ అవ్వడం రెండేళ్లుగా తన సక్సెస్ అవ్వకపోవడం అజయ్ ఫుల్ ప్రెషర్ లో ఉంటాడు. అలా సాగిపోతున్న తన జీవితంలో అనుకొని సంఘటన జరిగి చంద్రిక చనిపోతుంది. తన భార్యను చంపిన కేసులో తనని సస్పెక్ట్ గా అరెస్టు చేస్తారు. ఆ కేసు నుంచి హీరో బయట ఎలా పడ్డాడు అనేది ఈ సినిమా కథ.

నటీనటుల పనితీరు:

హీరో సందీప్ మంచి నటన కనబరిచాడు. అతని పాత్రని రాసుకున్న తీరు చూపించిన విధానం ఆకట్టుకుంటాయి. హీరోయిన్ డెబ్బి సాఫ్ట్ క్యారక్టర్ లో బాగా చేసింది.  షకలక శంకర్ రోల్ చాలా ఆసక్తి గా ఉంటుంది. తన పాత్రను చాలా కొత్తగా మలిచారు. హీరో ఫ్రెండ్స్ రోల్ లో మహేష్ విట్ట, నీరోజ్ పుచ్చ అలరించారు. చాందిని, మజిలీ శివ, దీప్తి వర్మ ఎవరికి వారు వారి కారెక్టర్ కి న్యాయం చేశారు.

సాంకేతిక నిపుణుల పనితీరు:

దర్శకుడు విజయ్ దాస్ పెందుర్తి ఎంచుకున్న స్క్రీన్ ప్లే తో సినిమాని ఆసక్తికరంగా మలిచారు. అనంత నారాయణ్ సంగీతం లైటర్ వీన్ లో ఉంటూనే సినిమా పైన ఇంటరెస్ట్ ని పెంచుతుంది. కెమెరా పనితనం ఆకట్టుకుంటుంది. ఎడిటింగ్ పట్ల కాస్త శ్రద్ధ తీసుకోవాల్సింది. చిన్న సినిమా అయినా నిర్మాణ విలువలు బాగున్నాయి.

హైలైట్స్ :

దర్శకత్వం, స్క్రీన్ ప్లే

నిర్మాణ విలువలు

షకలక శంకర్ నటన

డ్రాబ్యాక్స్ :

రొటీన్ కథ మరియు మ్యూజిక్.

విశ్లేషణ:

దర్శకుడు కథ ని ఎంచుకున్న తీరు, స్క్రీన్ ప్లే చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. దర్శకుడు ప్రతి కారెక్టర్ ని ఆసక్తికరంగా మలచడంలో పూర్తిగా విజయం సాధించారు. థ్రిల్లర్ చిత్రానికి అవసరమైన టైట్ స్క్రీన్ ప్లే తో ఆద్యంతం ఆకట్టుకునేలా చిత్రాన్ని నడిపించడంలో విజయం సాధించారు. థ్రిల్లర్స్ మరియు సస్పెన్స్ ని ఎక్కువగా ఇష్టపడే వాళ్ళకి నచ్చుతుంది.

చివరగా :ఆద్యంతం ఆసక్తిని రేకెత్తించే కథ.
రేటింగ్ : 3.25/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here