అష్టదిగ్భంధనం మూవీ రివ్యూ

0
330

చిత్రం: అష్టదిగ్భంధనం

విడుదల తేదీ: 22-09-2023

నటీనటులు: సూర్య భరత్ చంద్ర, విషిక కోట, విశ్వేందర్ రెడ్డి, మహేష్ రావుల్, రంజిత్, రోష్ని రజాక్, వివ రెడ్డి, నవీన్ పరమార్డ్, మణి పటేల్, విజయ్ కందగట్ల, యోగేందర్ సప్పిడి, మహమ్మద్ రజాక్, తదితరులు.

రచన – దర్శకత్వం: బాబా పి.ఆర్

నిర్మాత: మనోజ్ కుమార్ అగర్వాల్

మ్యూజిక్: జాక్సన్ విజయన్

కెమెరా: బాబు కొల్లబత్తుల

ఎడిటింగ్: నాగేశ్వర్ రెడ్డి బొంతల

ఫైట్స్: రామ్ క్రిషన్, శంకర్ ఉయ్యాల

లిరిక్స్: శ్యామ్ కాసర్ల, పూర్ణ చారి

ఆర్ట్: వెంకట్ ఆరే

పీఆర్వో: సురేష్ కొండేటి

ఆద్యంతం ఆసక్తికరంగా సాగే థ్రిల్లర్ సినిమాలకి ప్రేక్షకులు మొగ్గు చూపడానికి సిద్దంగా ఉంటారు. గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో ఉత్కంఠ రేపే ట్విస్టులతో నడిపిస్తే పెద్ద విజయాన్ని సాధించి పెడతాయి ఈ తరహా చిత్రాలు. ఈ ఫార్ములాను నమ్మి చేసిన సినిమానే ‘అష్టదిగ్భంధనం’. ‘ఎ గేమ్ విత్ క్రైమ్’ అనేది ట్యాగ్ లైన్. ట్యాగ్ లైన్‌కు తగ్గట్టుగానే క్రైమ్స్‌తో కూడిన ఒక గేమ్‌లా సినిమా ఉంటుంది. ‘సైదులు’ అనే సినిమాతో డైరెక్టర్‌గా మారిన బాబా పీఆర్ రెండో సినిమాకే ఇలాంటి థ్రిల్లర్ కథను ఎంచుకోవడంతోనే సగం.విజయం సాధించారు . ‘రచ్చ’ సినిమాలో జూనియర్ తమన్నాగా నటించిన విషిక కోట ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించింది. పలు లఘు చిత్రాలు, సినిమాల్లో నటించిన సూర్య భరత్ చంద్ర ‘అష్టదిగ్భంధనం’ సినిమాలో హీరోగా నటించాడు. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూ లో చూద్దాం

కథ:

శంకర్ ఒక రౌడీ షీటర్. రాజకీయాల్లో చేరి ఎమ్మెల్యే అవడం కోసం అధికార పార్టీలో ఎమ్మెల్యే టికెట్ కి రూ. 50 కోట్లు ఇచ్చేందుకు సిద్ధమవుతాడు. ఈ రూ. 50 కోట్ల కోసం అతడు ఎలాంటి పథకం పన్నాడు? హీరో హీరోయిన్లు ఆ పథకంలో ఎలా ఇరుక్కున్నారు? అసలు ఎవరు ఎవరికి స్కెచ్ వేశారు? లాంటి ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

నటీనటుల పనితీరు:

హీరోగా నటించిన సూర్య భరత్ చంద్ర తన నటనతో పర్వాలేదనిపించాడు. ఇక హీరోయిన్ విషిక తన గ్లామర్ తో కనువిందు చేయడమే కాకుండా మంచి నటనను కూడా కనబరిచింది. రౌడీ షీటర్ శంకర్ పాత్ర చేసిన అతను విలనిజం బాగా పండించాడు. అలాగే మంత్రి పాత్ర చేసిన అతను కూడా తన పాత్ర పరిధి మేరకు నటించారు. ఇక మిగతా నటీనటులు తమ పాత్రలకు న్యాయం చేశారు. అందరూ కొత్తవాళ్లే అయినా.. దర్శకుడు అనుకున్నది అనుకున్నట్లు రావడానికి సహకరించారు.

సాంకేతిక నిపుణుల పనితీరు:

దర్శకుడు బాబా తనకు ఇది రెండో సినిమానే అయినా తన స్కీన్‌ప్లేతో సినిమాను ఎంగేజింగ్ గా నడపడంలో సక్సెస్ అయ్యారు. ట్విస్టులను ఎక్సిక్యూట్ చేసిన విధానం బాగుంది. జాక్సన్ విజయన్ నేపథ్య సంగీతం సినిమా మూడ్ ను ఎలివెట్ చేసింది. బాబు కొల్లబత్తుల కెమెరా పనితనం ఆకట్టుకుంటుంది. నిర్మాత మనోజ్ కుమార్ అగర్వాల్ ఖర్చుకి వెనకాడకుండా సినిమా క్వాలిటీ గా వచ్చేలా నిర్మించారు.

విశ్లేషణ:

అష్టదిగ్భంధనం చిత్రాన్ని దర్శకుడు బాబా ఇద్దరు వ్యక్తుల అహం వల్ల జరిగే యుద్ధం పాయింట్ గా తీసుకుని దాని మీద పక్కా థ్రిల్లర్ గా తెరకెక్కించిన విధానం బాగుంది . ఫస్ట్ హాఫ్ అంతా సాఫీగా సాగిపోతుంది. ఫస్ట్ హాఫ్‌లో కొన్ని క్యారెక్టర్స్ గురించి సస్పెన్స్ క్రియేట్ చేసిన దర్శకుడు.. సెకెండాఫ్‌లో వాటికి కన్‌క్లూజన్ ఇచ్చాడు. ఇంటర్వెల్‌కు ముందు వచ్చే ట్విస్ట్ అయితే ఊహించలేని విధంగా ఉంటుంది. ఇక సెకెండాఫ్ అంతా ఏ క్షణం ఏం జరుగుతుందా అనే ఆసక్తితో నడిచిపోతుంది. ఫస్ట్ హాఫ్ కంటే సెకెండాఫ్‌లో దర్శకుడు ఎక్కువ ట్విస్టులను ప్లాన్ చేసి సినిమా ను థ్రిల్లింగ్ గా మలిచాడు. ట్రైలర్ చూసి ఇదేదో క్రైమ్ కథో, లస్ట్ స్టోరీనో అనుకునేవాళ్లకు.. సినిమా చూస్తే ఆ అభిప్రాయం మారిపోతుంది. అక్కడక్కడ ఒకట్రెండు లాజిక్స్‌ను వదిలేస్తే ఓవరాల్‌గా సినిమా బాగుంది.

చివరిగా: ఎంగేజింగ్ థ్రిల్లర్

రేటింగ్: 3/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here