‘ఆత్రేయపురం బ్రదర్స్’ చిత్రీకరణ పూర్తి

0
9
Athreyapuram Brothers Wraps Up Shooting
Athreyapuram Brothers Wraps Up Shooting

‘ఆత్రేయపురం బ్రదర్స్’ చిత్రీకరణ పూర్తి

శ్రీనివాస్ గవిరెడ్డి, సన్నీ పత్సా, గీత్ సాయిని, నేహా పఠాన్, రాజీవ్ కనకాల, శివాజీ రాజా, అన్నపూర్ణమ్మ, దేవి ప్రసాద్, రజిత, ప్రభావతి, హరితేజ, రఘు బాబు, శ్రీనివాస రెడ్డి, ప్రవీణ్, సిద్ధార్థ్ గొల్లపూడి, భద్రం, అరుణ్ దలై, నవీన్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘ఆత్రేయపురం బ్రదర్స్’. ఈ సినిమాకి రాజేష్ జగన్నాధం రచన, దర్శకత్వం వహిస్తున్నారు.

S2S సినిమాస్, ది ఫెర్వేంట్ ఇండీ ప్రొడక్షన్స్, గద్దె ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై VSK సంజీవ్, వంగపల్లి సందీప్, వంగపల్లి సంకీర్త్, ప్రవీణ్ గద్దె, రాజేష్ గద్దె, రాకేష్ గద్దె ఈ మూవీని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్‌ను మేకర్స్ ఇచ్చారు.

తాజాగా ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ పూర్తయింది. చిత్రీకరణకు టీం గుమ్మడికాయ కొట్టేసింది. ఇక మున్ముందు మరిన్ని ప్రమోషనల్ కంటెంట్‌తో ఆడియెన్స్‌ని మెప్పించనున్నారు. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రానున్న ఈ సినిమాకి రమీజ్ నవీత్ ఛాయాగ్రాహకుడిగా, సంతు ఓంకార్ సంగీత దర్శకుడిగా, అనిల్ పసల ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. అతి త్వరలో ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు ప్రకటించనున్నామని మేకర్స్ చెప్పారు.

నటీనటులు

శ్రీనివాస్ గవిరెడ్డి, సన్నీ పత్సా, గీత్ సాయిని, నేహా పఠాన్, రాజీవ్ కనకాల, శివాజీ రాజా, అన్నపూర్ణమ్మ, దేవి ప్రసాద్, రజిత, ప్రభావతి, హరితేజ, రఘు బాబు, శ్రీనివాస రెడ్డి, ప్రవీణ్, సిద్ధార్థ్ గొల్లపూడి, భద్రం, అరుణ్ దలై, నవీన్ తదితరులు.

సాంకేతిక బృందం

బ్యానర్స్: S2S సినిమాస్, ది ఫెర్వేంట్ ఇండీ ప్రొడక్షన్స్, గద్దె ఎంటర్‌టైన్‌మెంట్స్
నిర్మాతలు: VSK సంజీవ్, వంగపల్లి సందీప్, వంగపల్లి సంకీర్త్, ప్రవీణ్ గద్దె, రాజేష్ గద్దె, రాకేష్ గద్దె
రచన, దర్శకత్వం: రాజేష్ జగన్నాధం
ఛాయాగ్రహణం: రమీజ్ నవీత్
సంగీతం: సంతు ఓంకార్
ఎడిటర్: అనిల్ పసల
ప్రొడక్షన్ డిజైనర్స్: ప్రకీర్తి ఉప్పలపాటి, ధీరజ్
కాస్ట్యూమ్స్: మేఘన
VFX: దాత్య విజువల్స్
పీఆర్వో: సాయి సతీష్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here