చిత్రం: తురుమ్ ఖాన్ లు
విడుదల : 08/09/2023
నటీనటులు: నిమ్మల శ్రీరామ్, దేవరాజ్ పాలమూర్, అవినాష్ చౌదరి, ఐశర్య ఉల్లింగాల, పులి సీత, విజయ, శ్రీయాంక తదితరులు
రచన-దర్శకత్వం : ఎన్ శివ కల్యాణ్
నిర్మాత: ఎండీ అసిఫ్ జానీ
ఎడిటర్: నాగేశ్వర రెడ్డి బొంతల
సినేమోటోగ్రఫీర్: అంబటి చరణ్
సంగీత దర్శకులు: వినోద్ యాజమాన్య, అఖిలేష్ గోగు రియాన్.
ఎఫెక్ట్స్: వెంకట శ్రీకాంత్
మిక్సింగ్ : సంతోష్ కుమార్
ప్రొడక్షన్ హెడ్: రజిని కాంత్, శివ నాగిరెడ్డి పల్లి
ఎక్స్ గ్యూటివ్ ప్రొడ్యూసర్: దేవరాజ్ పాలమూర్
ఆర్ట్ డైరెక్టర్: రేమో వెంకటేష్
సహా నిర్మాత: కే. కళ్యాణ్ రావు
పీఆర్ఓ: హరీష్, దినేష్
అందరూ కొత్తవారే నటించి, నిర్మించిన తురుమ్ ఖాన్ లు ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు రియల్ హీరో బాలీవుడ్ స్టార్ సోనూ సూద్ ముఖ్య అతిథిగా రావడంతో ఈ చిత్రానికి ప్రేక్షకుల్లో హైప్ వచ్చింది. పక్కా తెలంగాణ, మహబూబ్ నగర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 8న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరీ ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో చూద్దాం.
కథ
తుపాకుల గూడెం అనే ఊర్లో శంకర్ (నిమ్మల శ్రీరామ్) యూత్ లీడర్, మరదలు లలిత (ఐశర్య ఉల్లింగాల) ను కరోనాలో పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు. వీరాజ్ బ్రహ్మ (దేవరాజ్ పాలమూర్) అలియాస్ బ్రహ్మం సిటీలో సాఫ్ట్ వేర్ ఉద్యోగి అయినా పెళ్లి కాలేదు అని అందరు హేళన చేసినా తన నోటి దూలతో అందరిని తిడుతూ ఉంటాడు. ఊర్లోకి వచ్చింది మొదలు తాగుడే పనిగా పెట్టుకుంటాడు. తాను కూడా పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. విష్ణు (అవినాష్ చౌదరి) కాలేజ్ లవ్ పద్మతో చిన్న మనస్పర్థతో బ్రేకప్ అవుతుంది. అదే సమయంలో ఊర్లో లాక్ డౌన్ విధిస్తారు. ఆ టైమ్ లో జరుగునున్న శంకర్ పెళ్లి ఆగిపోతుంది. పద్మ, విష్ణులను కలపడానికి స్వప్న సాయం చేస్తుంది. అదే క్రమంలో స్వప్న విష్ణుపై మనసు పడుతుంది. ఇక బ్రహ్మం భారతి (విజయ)తో ఎఫైర్ పెట్టుకోవాలనుకుంటాడు. ఈ ముగ్గిరి కథే తురమ్ ఖాన్ లు సినిమా. శంకర్ పెళ్లి ఎందుకు ఆగిపోయింది.? విష్ణు, పద్మ కలిశారా.? స్వప్న స్టోరీ ఏంటి.? బ్రహ్మం, భారతి ఎఫైర్ ఎంత వరకు దారి తీసింది.? అసలు ఈ ముగ్గురికి ఉన్న సంబంధం ఏంటి.? అనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
నటీనటుల పనితీరు:
నటీనటులు అందరూ కొత్తవాళ్లే అయినా పాత్రలకు సరిగ్గా సరిపోయారు. సినిమా చూస్తున్నంత సేపు వాళ్లతో ట్రావెల్ అవుతుంటాము. సినిమాలో శంకర్ పాత్ర చేసిన శ్రీరామ్ నిమ్మల చాలా మెచ్యుర్డ్ గా నటించారు. అలాగే జబర్దస్థ్ ఐశర్య తన అందం, అభినయంతో ఆకట్టుకుంది. బ్రహ్మం పాత్రలో దేవరాజ్ పాలమూర్ జీవించేశాడు. అసలు ఆయన రియల్ గా కూడా ఇలానే ఉంటాడేమో అనేంత సహజంగా చేశారు. ఇక భారతి తన స్క్రీన్ స్పేస్ లో అలరించింది. ఎమోషనల్ గా చెప్పే డైలాగులు ఆకట్టుకుంటాయి. విష్ణుగా అవినాశ్ చౌదరి బాగా చేశారు. తన పాత్రకు న్యాయం చేశారు. పద్మ పాత్రలో పులి సీత ఉన్నంతలో బాగా చేసింది.
ప్లస్ లు:
కథా నేపథ్యం
సంగీతం
కామెడీ
మైనస్ లు :
నెమ్మదిగా సాగే సెకండ్ హాఫ్
సాంకేతిక నిపుణుల పనితీరు :
చిత్ర దర్శకుడు ఎన్ శివ కళ్యాణ్ కొత్తవాడైనప్పటికీ ఎంతో అనుభవం ఉన్న డైరెక్టర్ ల కథను హ్యాండిల్ చేసిన విధానం ఆకట్టుకుంది. తాను రాసుకున్న కథను ప్రేక్షకుడు ఎంటర్టైన్ అయ్యేలా తీర్చిదిద్దగలిగారు. నటీనటులు కొత్తవాళ్లు అయినప్పటికీ వారి నుండి తనకు కథకు తగ్గట్టుగా నటన రాబట్టుకొగలిగారు. నేపధ్య సంగీతం సినిమాకి ప్రధానాకర్షణ గా నిలుస్తుంది. సిచువేషన్ కు తగ్గట్టుగా పాటలు బాగున్నాయి. కొన్ని కొన్ని సీన్లను ఎలివేట్ చేయడానికి నేపథ్య సంగీతం బాగా ఉపయోగపడింది. ఇక ఎడిటింగ్ విషయానికి వస్తే ఫస్ట్ అఫ్ లో షార్ప్ గా పనిచేసిన నాగేశ్వర్ రెడ్డి బొంతల సెకండ్ హాఫ్ లో తన కత్తెరకు ఇంకాస్త పదులు పెట్టి ఉంటే బాగుండేది. సినిమాటోగ్రాఫర్ అంబటి చరణ్ పల్లే నేపథ్యంలో సాగే కథను ఏ విధంగా చూపించాలో అదేవిధంగా చూపించి తన పనితనాన్ని కనబరిచారు. ఇక ఫైనల్ గా సినిమాను నిర్మించిన ఎండి ఆసిఫ్ జానీ తురుమ్ ఖాన్ లు తెరకెక్కించడంలో ఎక్కడ వెనకడుగు వేయకుండా, మంచి ప్రొడక్షన్ వాల్యూస్ తో రూపొందించారు. ఇది చిన్న సినిమా అని ఎక్కడ అనిపించదు అంటే దానికి కారణం క్వాలిటీ తో ఉన్న ప్రొడక్షన్ వ్యాల్యూస్ అని చెప్పవచ్చు.
విశ్లేషణ
టైటిల్స్ తో తెలంగాణ నేపథ్యంలో వచ్చే పాటతో ప్రేక్షకులను విలేజ్ మూడ్ లోకి తీసుకెళ్లారు. శంకర్ పెళ్లి హాడవిడితో కథ మొదలు అవుతుంది. మొదటి ముగ్గురి హీరోల క్యారెక్టర్లు ఇంట్రడక్షన్ లతో కథ పార్లల్ గా నడుస్తుంది. ముఖ్యంగా విలేజ్ బ్యాగ్ డ్రాఫ్ లో కథ కాబట్టి చాలా సహజంగా తెరకెక్కించారు. ఇక కరోనా సమయంలో లాక్ డౌన్ ను బ్యాక్ డ్రాప్ గా పెట్టుకోవడం మంచి ఐడియా. ఆ రోజులను ఈ సినిమా మళ్లీ గుర్తు చేస్తుంది. కామెడీ సీన్స్ కి తోడు ఫన్ని డైలాగ్ లు పడడంతో ప్రేక్షకుడికి కావల్సినంత వినోదం అందుతుంది. సినిమాలో శంకర్, బ్రహ్మం ఇద్దరు టామ్ అండ్ జెర్రిలా ఎత్తులు, పై ఎత్తులతో ప్రేక్షకులను అలరిస్తుంది. 133 నిముషాలు నిడివి ఉన్న ఈ సినిమా ఆద్యంతం నవ్వించడం లో విజయం సాధించింది. ఫస్ట్ ఆఫ్ చాలా హూషారుగా సాగిపోతుంది. సెకండ్ కాస్త నెమ్మదించిన మళ్లీ అదే జోరులో సాగుతుంది. ఇంటర్వేల్ సీన్ ఆసక్తికరంగా ఉంది. ఇక క్లైమాక్స్ చూసిన తరువాత మంచి కామెడీ సినిమా చూసి బాగా ఎంజాయ్ చేసిన ఫీలింగ్ కలుగుతుంది.
రేటింగ్: 3.5/5
చివరగా: ఆద్యంతం నవ్వించే హిలేరియస్ కామెడీ ఎంటర్టైనర్