సుధీర్ బాబు ‘మామా మశ్చీంద్ర’ అక్టోబర్ 6న విడుదల

0
257

నైట్రో స్టార్ సుధీర్ బాబు క్రేజీ ప్రాజెక్ట్ ‘మామా మశ్చీంద్ర’లో త్రిపాత్రాభినయంతో అలరించబోతున్నారు. యాక్టర్ -ఫిల్మ్ మేకర్ హర్షవర్ధన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పిపై నిర్మాతలు సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు నిర్మించారు. ఇందులో దుర్గ- స్థూలకాయుడు, పరశురాం- ఓల్డ్ డాన్, డిజె .. ఇలా మూడు భిన్నమైన పాత్రలలో కనిపించబోతున్నారు సుధీర్ బాబు.

ఈ రోజు మేకర్స్ ‘మామా మశ్చీంద్ర’ రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు. అక్టోబర్ 6న ఈ సినిమాని గ్రాండ్ గా విడుదల చేస్తున్నారు. రిలీజ్ డేట్ పోస్టర్ లో దుర్గ- ఓల్డ్ డాన్, డిజె.. ఈ మూడు లుక్స్ లో ఆకట్టుకున్నారు సుధీర్ బాబు.

ఇప్పటికే ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్ ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. టీజర్ సినిమా పై క్యురియాసిటీని పెంచింది. ఫస్ట్ సింగిల్ గాలుల్లోన సంగీత ప్రియులను అలరించింది. విడుదల తేదీని లాక్ చేయడంతో మేకర్స్ ప్రచార కార్యక్రమాలను దూకుడుగా చేయనున్నారు.

ఈ చిత్రంలో మిర్నాళిని రవి, ఈషా రెబ్బా హీరోయిన్స్ గా నటిస్తున్నారు. పిజి విందా సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు. రాజీవ్ ఆర్ట్ డైరెక్టర్.

తెలుగు, హిందీ భాషల్లో రూపొందిన ఈ ద్విభాషా చిత్రాన్ని సృష్టి సెల్యులాయిడ్‌ సోనాలి నారంగ్, సృష్టి సమర్పిస్తున్నారు.

తారాగణం: సుధీర్ బాబు, మిర్నాళిని రవి, ఈషా రెబ్బా, హర్షవర్ధన్

సాంకేతిక విభాగం:
రచన, దర్శకత్వం: హర్షవర్ధన్
నిర్మాతలు: సునీల్ నారంగ్,  పుస్కుర్ రామ్ మోహన్ రావు
సమర్పణ: సోనాలి నారంగ్, సృష్టి (సృష్టి సెల్యులాయిడ్)
బ్యానర్: శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్ పి
సంగీతం: చైతన్ భరద్వాజ్
డీవోపీ: పీజీ విందా
ఆర్ట్ డైరెక్టర్: రాజీవ్
పీఆర్వో: వంశీ-శేఖర్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here