‘ఖుషి’ హార్ట్ టచింగ్, ఎంటర్ టైనింగ్ లవ్ స్టోరి – డైరెక్టర్ శివ నిర్వాణ

0
243

లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్ ను సరికొత్తగా తెరపై చూపిస్తూ టాలీవుడ్ లో తనదైన ముద్ర వేశారు దర్శకుడు శివ నిర్వాణ. ఆయన తెరకెక్కించిన నిన్ను కోరి, మజిలీ, టక్ జగదీశ్ సినిమాలు సకుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకుని సక్సెస్ అయ్యాయి. విజయ్ దేవరకొండ, సమంత జంటగా డైరెక్టర్ శివ నిర్వాణ రూపొందించిన కొత్త సినిమా ‘ఖుషి’ మరో మూడు రోజుల్లో పాన్ ఇండియా స్థాయిలో విడుదలకు సిద్ధమవుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మించారు. ‘ఖుషి’ విడుదలకు రెడీ అవుతున్న సందర్భంగా ఈ సినిమా తెరకెక్కించిన ఎక్సీపిరియన్స్ తెలిపారు డైరెక్టర్ శివ నిర్వాణ.

పెళ్లికి ముందు పెళ్లి తర్వాత సమస్యలతో గతంలో అనేక సినిమాలు వచ్చాయి. అయితే ఈ సినిమాలో టైటిల్ కు తగినట్లుగా ఎంటర్ టైన్ మెంట్ తో కథను చెప్పాలని అనుకున్నాను. ట్రైలర్ లో ఎంటర్ టైన్ మెంట్ తో ఉన్న సీన్స్ చూశారు. ఇవన్నీ థియేటర్ లో హార్ట్ టచింగ్ గా ఉంటాయి. డియర్ కామ్రేడ్ సినిమా తర్వాత విజయ్ కి ఈ కథ చెప్పాను. కథ చెప్పిన ఏడాదిన్నర తర్వాత సినిమా సెట్స్ మీదకు తీసుకెళ్లాం. ఎందుకంటే విజయ్ లైగర్ సినిమాలో బిజీగా ఉన్నారు. నేను నిన్ను కోరి, మజిలీ, టక్ జగదీశ్ చేసిన తర్వాత ఔట్ ఆఫ్ ది బాక్స్ మూవీ చేయాలని అనుకున్నాయి. అయితే విజయ్ ని కలిసినప్పుడు ఖుషి కథ పాయింట్ గా చెప్పాను. ఆయనకు బాగా నచ్చింది. అలా ‘ఖుషి’ జర్నీ మొదలైంది.

‘ఖుషి’ మణిరత్నం ‘సఖి’ లాంటి పాయింట్ అనే వార్తలూ వచ్చాయి కానీ ఇందులో ఒక యూనిక్ పాయింట్ ఉంటుంది. ఇవాళ్టి కాంటెంపరరీ సొసైటీలో ఉన్న ఒక ఇష్యూను విజయ్, సమంత లాంటి పాపులర్ స్టార్స్ ద్వారా అడ్రస్ చేయిస్తే బాగుంటుందని నమ్మాను. వాళ్లకూ ఈ పాయింట్ కనెక్ట్ అయ్యింది. ఆ పాయింట్ ఏంటనేది ట్రైలర్ లో మేము చూపించలేదు. థియేటర్ లో చూడాలి.

నేను గతంలో తెరకెక్కించిన నిన్ను కోరి, మజిలీలో ఫెయిల్యూర్ లవ్ స్టోరీస్ చూపించాను. కానీ ఈసారి ఒక ఎంటర్ టైనింగ్, ఎనర్జిటిక్, సరదాగా ఉండే ప్రేమ కథను రూపొందించాలని అనుకున్నాను. నేను వ్యక్తిగతంగా సరదాగా ఉండే పర్సన్ ని. ఈ సినిమాకు సరదా అని, మరికొన్ని టైటిల్స్ అనుకున్నాను. కానీ విజయ్, సమంతకున్న పాన్ ఇండియా ఇమేజ్ కు సినిమాను పాన్ ఇండియా స్థాయిలో తీసుకెళ్లాలి అనుకున్నప్పుడు ఐదు భాషలకు కలిపి ఒకే టైటిల్ ఉంటే బాగుంటుంది అనిపించింది. అలా ‘ఖుషి’ టైటిల్ ఫిక్స్ చేశాం. ఈ సినిమా హీరో అనీ, హీరోయిన్ అనీ ఎవరి వెర్షన్ లో ఉండదు. బ్యాలెన్స్ గా ఉంటుంది. ఈ సినిమా విజయ్ తో స్టార్ట్ అయ్యింది. ఆ తర్వాత సమంత లాంటి ఫర్ ఫార్మింగ్ హీరోయిన్ ఉంటే సినిమా మరింత స్ట్రాంగ్ అవుతుందని చెప్పి ఆమెను అడిగాం. ఈ సినిమాలో విజయ్ ను లేడీ ఆడియెన్స్ బాగా ఇష్టపడతారు.

ప్రేమ కథను ఎంత కొత్తగా చెప్పాలి అనే ఆలోచన నుంచి పుట్టిందే కాశ్మీర్ బ్యాక్ డ్రాప్. కథ రాసేప్పుడు సెకండాఫ్ రెడీ అయ్యింది. కానీ ఫస్టాఫ్ లో లవ్ స్టోరిని కాలేజీలో చూపించకుండా ఒక ఫీల్ గుడ్ ప్లేస్, ప్లెజంట్ గా ఉండే ప్లేస్ నుంచి మొదలుపెడితే బాగుంటుంది అనిపించింది. అలాగే హీరో హీరోయిన్ల మధ్య పరిచయం ఫన్ తో సాగాలి అనుకున్నాను. మీరు ట్రైలర్ లో చూసినట్లు హీరో హీరోయిన్ ను బేగమ్ అని ఒకసారి, మరోసారి ఇంకోలా పిలుస్తుంటాడు. ఇవన్నీ సరదాగా ఉంటాయి. సమంత షూటింగ్ కోసం ఎంతో కోపరేట్ చేస్తుంది. చాలా డెడికేటెడ్ హీరోయిన్. అలాంటి హీరోయిన్ కు ఒక హెల్త్ ప్రాబ్లమ్ వస్తే మేమంతా సపోర్ట్ చేయకుంటే ఎలా. ఆమె ట్రీట్ మెంట్ మధ్యలో వస్తా అని చెప్పేది కానీ మధ్యలో గ్యాప్ ఇస్తూ షెడ్యూల్స్ చేయడం ఇబ్బందిగా ఉండి..పూర్తిగా నయమైన తర్వాతే రమ్మని చెప్పాం.

‘ఖుషి’ మ్యూజిక్ కోసం హేషమ్ ను కలిసి మాట్లాడినప్పుడు ఆయన మంచి మ్యూజిక్ ఇవ్వగలడని అనిపించింది. విజయ్ కు చెప్పగానే ఆయన కూడా ఓకే అన్నారు. హేషమ్ సూపర్బ్ మ్యూజిక్ ఇచ్చాడు. పాటలన్నీ హిట్. నా రోజా నువ్వే హిందీ సహా అన్ని లాంగ్వేజెస్ లో హిట్టయ్యింది. మ్యూజిక్ కు మంచి పేరొచ్చింది కాబట్టి ఆ మ్యూజిక్ తోనే సినిమా ప్రమోషన్ గ్రాండ్ గా స్టార్ట్ చేయాలని అనుకుని మ్యూజిక్ కన్సర్ట్ పెట్టాం. ఇది విజయ్ చెప్పిన ఆలోచనే.

‘ఖుషి’ పాటల కోసం హేషమ్ నేను సిట్టింగ్స్ లో ఉన్నప్పుడు నాకు నచ్చిన ట్యూన్ రావడం లేదు. ఈ సినిమాలో హీరోకు కాశ్మీర్ అంటే ఇష్టం, మణిరత్నం సినిమాలను ప్రేమిస్తాడు. ఆ క్యారెక్టర్ పాడినట్లు..నా రోజా నువ్వే, దిల్ సే నువ్వే, అంజలి, గీతాంజలి నువ్వే అని లిరిక్ రాసి ఇచ్చాను. దానికి హేషమ్ ట్యూన్ చేసి పాడాడు. సాయంత్రం 5 గంటల వరకు రికార్డింగ్ తో సహా పాట పూర్తైంది. మైత్రీ ఆఫీస్ లో వినిపిస్తే అందరూ చాలా బాగుందన్నారు. ఆరాధ్యలోనూ నా చెలితారా అనే హుక్ లైన్ రాశాను. అలా నేను ఏదో లైన్ రాయడం హేషమ్ ట్యూన్ కుదరడం జరిగింది. ఇదేదో బాగా వర్కవుట్ అవుతుందని అలా మొత్తం పాటలన్నీ చేశాం. నా గత సినిమాలు నిన్ను కోరి, మజిలీ, టక్ జగదీశ్ లోనూ పాటలు రాశాను. నాకు లిరిసిస్ట్ లు అందరితో మంచి రిలేషన్ ఉంది. ఈ సినిమాకు ఇలా వెళ్లాం. నెక్ట్ మూవీస్ కు వాళ్ళ తో కలిసి పనిచేస్తా. అప్పుడు కుదిరితే నేను కూడా రాస్తాను.

విజయ్ లో మంచి కామెడీ టైమింగ్ ఉంటుంది. పెళ్లి చూపులు, గీత గోవిందంలో ఒకలాంటి కామెడీ టైమింగ్ చూశారు. కానీ ఇందులో స్టైలిష్ కామెడీ చేశాడు. అమ్మాయిలకు, ఫ్యామిలీ ఆడియెన్స్ కు విజయ్ క్యారెక్టర్ బాగా నచ్చుతుంది. అందరూ ఆయన క్యారెక్టర్ ను ఓన్ చేసుకుంటారు. ‘ఖుషి’ లో హిందూ ముస్లిం మధ్య గొడవలు చూపించడం లేదు. కానీ ఒక వెరీ సెన్సిటివ్ ఇష్యూను కథలో చూపిస్తాం. అది మీకు నచ్చుతుంది. ఒక ప్లెజంట్ ఎట్మాస్పియర్ కోసమే కాశ్మీర్ బ్యాక్ డ్రాప్ తీసుకున్నాం.

మైత్రీ ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ కు ఎంత ఫ్రీడమ్ ఇస్తారో మీకు తెలుసు. వాళ్లు ఇచ్చిన రిసోర్సెస్ ను బాగా ఉపయోగించుకోవాలే గానీ ఎంతైనా క్రియేటివిటీ చూపించుకోవచ్చు. నేనే కాదు ప్రతి దర్శకుడు మైత్రీ వాళ్ల గురించి మంచిగా చెబుతారు. నిన్ను కోరి సినిమా యూఎస్ లో షూటింగ్ చేస్తున్నప్పుడు రవి గారు నన్ను కలిశారు. మనం సినిమా చేయాలని అన్నారు. నేను ఈ కథ చెప్పినప్పుడు ఆయన హార్ట్ టచింగ్ గా ఫీలయ్యారు. మైత్రీలో భారీ యాక్షన్ మూవీస్ చేస్తున్నప్పుడు ఒక లవ్ స్టోరి నిర్మిస్తే బాగుంటుందని ఆయన అన్నారు. ఐదు నెలలు ‘ఖుషి’ షూటింగ్ ఆగిపోయినా ఏరోజూ వాళ్లు క్వశ్చన్ చేయలేదు. సెట్ కొచ్చి..ఇంకొంచెం పెద్ద సెట్ వేస్తే బాగుండేది అనేవారంటే వాళ్లు ఎంత సపోర్ట్ చేశారో మనం అర్థం చేసుకోవచ్చు. నేను కనెక్ట్ అయితే వరుసగా సినిమాలు చేస్తాను. నానితో రెండు సినిమాలు చేశాను, అలాగే షైన్ స్క్రీన్స్ సంస్థలో రెండు మూవీస్ చేశాను. ఇప్పుడు మైత్రీతో అనుబంధం ఏర్పడింది.

‘ఖుషి’ లో వింటేజ్ సమంతను చూస్తారు. ఆమె ఫ్యామిలీ మ్యాన్ వంటి డిఫరెంట్ జానర్స్ చేసింది. ఇప్పుడు లవ్ స్టోరిలో సమంతను చూడటం మంచి ఫీల్ కలిగిస్తుంది. స్పీడ్ గా సినిమాలు చేయడం నా చేతిలో లేదు డెస్టినీ. రెండేళ్లకో సినిమా చేస్తూ వచ్చా. మధ్యలో కోవిడ్ వచ్చింది. అప్పుడు కూడా కష్టపడి ఎలాగో టక్ జగదీశ్ కంప్లీట్ చేశాం. అది ఓటీటీకి వెళ్లింది. నా గత చిత్రం టగ్ జగదీశ్ థియేటర్ కోసం చేసిన సినిమానే కానీ ఓటీటీకి వెళ్లింది. థియేటర్ లో రిలీజైతే దాని రిజల్ట్ ఎలా ఉండేదో తెలియదు. కానీ నేను మనసుపెట్టి చేసిన సినిమా టక్ జగదీశ్.

‘ఖుషి’ సినిమా కథకు సమంత రియల్ లైఫ్ కు ఎలాంటి పోలికలు, సంబంధం లేదు. నేను మూడేళ్ల క్రితం రాసుకున్న కథ ఇది. ఆమెతో మజిలీ సినిమా చేశాను కాబట్టి బాగా నటించగలదు అని ఇందులోకి తీసుకున్నాం. నేను రాసిన కథలో ఆమె తన క్యారెక్టర్ ప్లే చేసింది అంతే. మరో హీరోయిన్ ఈ సినిమాలో నటిస్తే ఇలాంటి ప్రశ్నలకు అవకాశం ఉండదు.

నేను దర్శకుడు మణిరత్నం అభిమానిని. ఆయన సినిమాలను ఇష్టపడతాను. ఇండస్ట్రీలోకి రావాలనుకున్నప్పుడు చెన్నై వెళ్లి ఆయన దగ్గర జాయిన్ అవ్వాలనుకున్నా. అయితే వారం రోజులు ప్రయత్నించినా మణిరత్నం గారిని కలవడం కుదరలేదు. నేను ఆయన సినిమాలను ఇష్టపడతాను కానీ ఆయనలా తీయాలనుకోను. మణిరత్నంలా ఒక్క ఫ్రేమ్ కూడా ఎవరూ పెట్టలేరు. ఆయన సినిమాల్లోని ఈస్థటిక్ సెన్స్, మ్యూజిక్ సెన్స్ నుంచి ఇన్ స్పైర్ అవుతాం అంతే.

బాహుబలి, పుష్ప, ఆర్ఆర్ఆర్, కార్తికేయ వంటి సినిమాలన్నీ మనకు నచ్చేలా చేసుకున్న సినిమాలు. ఇతర భాషల వాళ్లు ఇష్టపడి పాన్ ఇండియా అయ్యాయి. నా దృష్టిలో మనకు నచ్చే మన నేటివిటీ సినిమా బాగా చేసుకుంటే అది ఇతరులకు నచ్చి పాన్ ఇండియా మూవీ అవుతుంది. పాన్ ఇండియాకు చేయాలని మనం ప్లాన్ ముందే చేసుకోనవసరం లేదనేది నా అభిప్రాయం. ‘ఖుషి’ థియేటర్ లో చూసి ఒక మంచి అనుభూతితో బయటకు వస్తారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here