మెగాస్టార్ చిరంజీవి మెగా యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘భోళా శంకర్’. స్టైలిష్ మేకర్ మెహర్ రమేష్ దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర భారీ కాన్వాస్‌లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ తో పాటు భోళా మానియా, జామ్ జామ్ జజ్జనక పాటలకు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ చిత్రం థర్డ్ సింగిల్ ‘మిల్కీ బ్యూటీ’ పాటని సెన్సేషనల్ కంపోజర్ తమన్ లాంచ్ చేశారు.
మహతి స్వర సాగర్ ఈ పాటని లవ్లీ లైవ్లీ మెలోడీగా స్వరపరిచారు. విజయ్ ప్రకాష్, సంజన కల్మంజే కలసి మహతి స్వర సాగర్ ఈ పాటని గ్రేస్ ఫుల్ గా ఆలపించారు. ‘సరస్వతి పుత్ర’ రామజోగయ్య శాస్త్రి అందించిన సాహిత్యం ఆకట్టుకుంది.
ఈ పాటలో చిరంజీవి డాన్స్, స్వాగ్ మెస్మరైజింగా వున్నాయి. మెలోడీ పాటల్లో మెగాస్టార్ డ్యాన్స్ చూడటానికి ప్రేక్షకులు ప్రత్యేకంగా ఎదురుచూస్తుంటారు. ఈ పాటలో మెగా డ్యాన్స్ మూమెంట్స్ కన్నుల పండగలా వున్నాయి. మెగాస్టార్ తో కలసి తమన్నా చేసిన డ్యాన్స్ మూమెంట్స్ కూడా ఆకట్టుకున్నాయి. ఈ పాటలో వారి కెమిస్ట్రీ బ్యూటీఫుల్ గా వుంది.
A delightful melody that weaves a beautiful tapestry of emotions this rainy season❤️#MilkyBeauty Lyrical song out now❤️🔥
– https://t.co/rn3OG8y9qY#BholaaShankar 🔱@SagarMahati thumping musical 🥁
Mega🌟 @KChiruTweets
A film by @MeherRamesh @AnilSunkara1 @tamannaahspeaks… pic.twitter.com/nQxyufXrJ9— BA Raju's Team (@baraju_SuperHit) July 21, 2023
అనిల్ సుంకర ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. డడ్లీ డీవోపీగా పని చేస్తున్నారు. సత్యానంద్ కథ పర్యవేక్షణ చేయగా తిరుపతి మామిడాల డైలాగ్స్ అందిస్తున్నారు. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటర్ గా, ఎఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేస్తున్నారు. కిషోర్ గరికిపాటి ఎగ్జిక్యూటివ్ నిర్మాత.
భోళా శంకర్ ఆగస్టు 11న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.
తారాగణం: చిరంజీవి, తమన్నా, కీర్తి సురేష్, సుశాంత్, రఘు బాబు, మురళీ శర్మ, రవిశంకర్, వెన్నెల కిషోర్, తులసి, సురేఖా వాణి, శ్రీ ముఖి, హైపర్ ఆది, వైవా హర్ష, ప్రదీప్, అనీ, బిత్తిరి సత్తి, సత్య, గెటప్ శ్రీను, వేణు టిల్లు, తాగుబోతు రమేష్, రష్మీ గౌతమ్, ఉత్తేజ్, వీర్, షావర్ అలీ & తరుణ్ అరోరా
సాంకేతిక విభాగం :
స్క్రీన్ ప్లే, దర్శకత్వం: మెహర్ రమేష్
నిర్మాత: రామబ్రహ్మం సుంకర
బ్యానర్: ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కిషోర్ గరికిపాటి
సంగీతం: మహతి స్వర సాగర్
డీవోపీ: డడ్లీ
ఎడిటర్: మార్తాండ్ కె వెంకటేష్
ప్రొడక్షన్ డిజైనర్: ఏఎస్ ప్రకాష్
కథా పర్యవేక్షణ: సత్యానంద్
డైలాగ్స్: తిరుపతి మామిడాల
ఫైట్ మాస్టర్స్: రామ్-లక్ష్మణ్, దిలీప్ సుబ్బరాయన్, కాచే కంపాక్డీ
కొరియోగ్రఫీ: శేఖర్ మాస్టర్
లిరిక్స్: రామజోగయ్య శాస్త్రి, కాసర్ల శ్యామ్, శ్రీమణి, సిరాశ్రీ
పీఆర్వో: వంశీ-శేఖర్
వీఎఫ్ఎక్స్ సూపర్‌వైజర్: యుగంధర్
పబ్లిసిటీ డిజైనర్లు: అనిల్-భాను
డిజిటల్ మీడియా హెడ్: విశ్వ సిఎం
లైన్ ప్రొడక్షన్: మెహెర్ మూవీస్