‘మేమ్ ఫేమస్‌’ చిత్ర యూనిట్ ని అభినందించిన దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి  

0
306

చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్, లహరి ఫిలింస్ సంయుక్తంగా నిర్మించిన ‘మేమ్ ఫేమస్’ చిత్రం సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ చిత్రం ఫస్ట్ వీకెండ్ లో ప్రపంచవ్యాప్తంగా రూ. 3.1 కోట్లు గ్రాస్ వసూలు చేసింది.

 

తన గత చిత్రం ఆర్ఆర్ఆర్ తో అస్కార్ అవార్డును గెలుచుకున్న దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి ‘మేమ్ ఫేమస్‌’ చిత్రాన్ని థియేటర్ లో వీక్షించి చిత్ర యూనిట్ అభినందించారు. నటుడు, దర్శకుడు సుమంత్ ప్రభాస్‌ కు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. మిగతా నటీ నటులందరినీ, ముఖ్యంగా అంజి మామ ను కూడా ప్రశంసించారు.

 

“చాలా కాలం తర్వాత థియేటర్‌లో ఓ సినిమాని పూర్తిస్థాయిలో ఎంజాయ్ చేశాను. ఈ అబ్బాయి.. సుమంత్ కోసం చూడండి. దర్శకుడు, నటుడు సుమంత్ కు మంచి భవిష్యత్తు ఉంది. అన్ని పాత్రలు చక్కగా వున్నాయి. నటీనటులు సహజంగా నటించారు. ముఖ్యంగా అంజి మామ. ఈ మూవీ చూడాల్సిందిగా ప్రతి ఒక్కరికీ రెకమెండ్ చేస్తున్నాను. యూత్‌ ను ఎంకరేజ్ చేయాలి.. దమ్ దమ్ చేయొద్దు. #మేమ్ ఫేమస్ .” అని ట్వీట్ చేశారు రాజమౌళి.

 

రాజమౌళి పాజిటివ్ ఫీడ్ బ్యాక్ బాక్సాఫీస్ వద్ద మేమ్ ఫేమస్‌ కు మరింత బలాన్ని ఇవ్వనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here