మేమ్ ఫేమస్’ కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది: యూత్ బ్లాక్ బస్టర్ పంచాయతీ ప్రెస్ మీట్ లో చిత్ర యూనిట్

0
115

మేమ్ ఫేమస్’ కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. కొందరు పనిగట్టుకుని నెగిటివ్ ప్రచారం చేయడం సరికాదు. సినిమా గురించి ఏదైనా అనిపిస్తే ఒక ప్లేస్ లో లైవ్ పెడదాం. క్లియర్ గా  మాట్లాడుకుందాం. దయచేసి యూత్ ని తొక్కే ప్రయత్నం చేయొద్దు: యూత్ బ్లాక్ బస్టర్ పంచాయతీ ప్రెస్ మీట్ లో చిత్ర యూనిట్

రైటర్ పద్మభూషణ్ బ్లాక్ బస్టర్ విజయం తర్వాత లహరి ఫిల్మ్స్, చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్ కలిసి చేసిన మరో  యూత్ ఫుల్ ప్రాజెక్ట్ ‘మేమ్ ఫేమస్’. సుమంత్ ప్రభాస్ దీనికి దర్శకత్వం వహించడంతో పాటు ప్రధాన పాత్ర పోషించారు. మణి ఏగుర్ల, మౌర్య చౌదరి, సార్య, సిరి రాసి ఇతర ప్రముఖ తారాగణం. అనురాగ్ రెడ్డి, శరత్, చంద్రు మనోహరన్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు.  ఈనెల 26 న విడుదలైన ఈ సినిమా యూత్ బ్లాక్ బస్టర్ సక్సెస్ ని అందుకుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ యూత్ బ్లాక్ బస్టర్ పంచాయతీ ప్రెస్ మీట్ నిర్వహించింది.

ప్రెస్ మీట్ లో నిర్మాత శరత్ మాట్లాడుతూ.. మేము చాలా కష్టపడి ఒక సినిమా చేశాం. అది బాగలేకపోతే ఇక్కడ నిలబడం. కావాలనే సినిమాని తొక్కేయాలని కొందరు చూస్తున్నారు. మా జీవితంలో మేము ఏం చేయాలని అలోచించాం తప్ప పక్కొడిని ఎట్లా తొక్కేయాలని ఆలోచించలేదు. ఇది మాకే కాదు ఇండస్ట్రీలో నిర్మాత దర్శకుడు హీరో  ప్రతి  ఒక్కరు ఎదుర్కొని ఉంటారు. చాలాసార్లు దీని గురించి మాట్లాడాలని అనుకున్నాం. కానీ ఈ రోజు 22 ఏళ్ల పిల్లలకి ఇలా జరుగుతుంటే చాలా బాధ అనిపించి దీనిని అడ్రస్ చేస్తున్నాం. సినిమా గురించి మీకు ఏదైనా అనిపిస్తే ఒక ప్లేస్ అనుకుందాం. లైవ్ పెడదాం. క్లియర్ గా మాట్లాడుకుందాం. అంతేగాని అసభ్యంగా మాట్లాడటం మాత్రం చేయకండి. దాని ద్వారా చాలా మంది బాధపడతారు. సోషల్ మీడియాని పాజిటివ్ గా వాడుకోవాలి. నెగిటివ్ గా వాడితే దాని వలన నష్టం తప్పితే లాభం లేదు. మీకు నచ్చకపొతే ట్విట్టర్ లో చెప్పండి.మీతో కలిసి సినిమా చూసి చర్చించుకుందాం. ఇది యూత్ సినిమా. యూత్ చాలా కనెక్ట్ అవుతున్నారు. మంచి మోటివేషన్ ఇచ్చే సినిమా కాబట్టి యూత్ చూడాలనే ఉద్దేశంతో స్టూడెంట్ అందరికీ రూ. 99 కె టికెట్ రేటు ఉండేలా చేశాం. కౌంటర్ లో మీ ఐడీ కార్డ్ చూపిస్తే 99 కె టికెట్ ఇస్తారు. ఈ రోజు ఉదయం నుంచే ఇది లాంచ్ అయ్యింది. థియేటర్ లిస్టు కూడా పెడతాం. మంచి ఉద్దేశంతో సినిమా చేశాం. రిజల్ట్ పట్ల చాలా ఆనందంగా వుంది. . అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. ఒక్క శాతం నెగిటివిటీ కూడా మాయమైపోతుంది. సినిమా కి చాలా పెద్ద లాంగ్ రన్ వుంటుంది’’ అన్నారు.

సుమంత్ ప్రభాస్ మాట్లాడుతూ.. చాయ్ బిస్కెట్ మాకు సినిమా అవకాశం ఇచ్చింది. కొత్త వాళ్ళని ప్రోత్సహించాలని ఇండస్ట్రీలో ఉన్న పెద్ద వాళ్ళు అందరూ వచ్చి మాకు సపోర్ట్ చేశారు. చూసిన ప్రేక్షకులు బాగుంది అన్నారు. మూడు రోజుల్లో మూడు కోట్లు ఇచ్చారు. కొత్త వాళ్ళకి మూడు రోజుల్లో మూడు కోట్లు రావడం నాకు చాలా క్రేజీగా అనిపించింది. ఐతే మధ్యలో నెగిటివిటి ని ప్రచారం చేస్తున్న వారెవరో అర్థం కావడం లేదు. కావాలనే కొందరు పనిగట్టుకుని సినిమా నెగిటివిటి స్ప్రెడ్ చేస్తున్నారు. దీని వలన వాళ్లకి ఏం లాభాలో అర్ధం కావడం లేదు. కొత్తవాళ్ళని ప్రోత్సహించాలి కానీ ఇలా నెగిటివ్ చేసి వెనక్కి లాగడం సరికాదు. ఇలాంటి నెగిటివిటీ ని పట్టించుకోవద్దు. సినిమాకి వెళ్ళండి. మీ టికెట్ డబ్బులు ఎక్కడికీ పోవు. రెండున్నర గంటలు ఎంజాయ్ చేస్తారు’’ అన్నారు

అనురాగ్ రెడ్డి మాట్లాడుతూ.. ‘మేమ్ ఫేమస్’ గత మూడు రోజుల్లో మూడు కోట్ల కు దాటింది. కొత్త  ప్రతిభని ప్రోత్సహించిన తెలుగు ప్రేక్షకులు కృతజ్ఞతలు. ప్రివ్యూస్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. కొన్ని మిశ్రమ రివ్యూలు కూడా వచ్చాయి. అయితే ఫిలిం మేకర్స్ గా అన్నిటినీ యాక్సెప్ట్ చేయాలి. మళ్ళీ థియేటర్స్ విజిట్ చేసినప్పుడు ప్రివ్యూస్ కి వచ్చిన అద్భుతమైన ఆదరణే కనిపించింది. థియేటర్ లో రెస్పాన్స్ క్రేజీ గా వుంది. అందరి అభిప్రాయాలని గౌరవించాలి. సినిమా బావుందని చెప్పిన వాళ్ళని ఎందుకు బావుందని అడిగే పరిస్థితి సోషల్ మీడియాలో కనిపించడం సరి కాదనిపిస్తోంది. అందరూ కొత్తవాళ్ళు కలిసి చేసిన ఒక ప్రయత్నాన్ని కిందకు లాగేయడం మంచిది కాదు. మేము ఆస్కార్ సినిమా తీశామని చెప్పడం లేదు. కుర్రాళ్ళు అంతా కలసి ఒక స్వీట్ మూవీ తీశాం. దీనిపై భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు. మమ్మల్ని ట్రోల్ రోస్ట్ చేయాలనుకుంటే ఒక వేదిక అనుకుందాం. అక్కడ మీ అభిప్రాయాలని స్వేఛ్చగా చెప్పొచ్చు. అంతేగానీ పనిగట్టుకొని ఒక ఆర్గనైజ్ గా కిందకు లాగేయాలని అనుకోవడం ఇబ్బందిగా అనిపించింది. ఈ సినిమా నచ్చిన వారిని కించపరచ వద్దు. ప్రతిది కష్టపడి చేశాం. కొత్త వాళ్ళని జనాల్లోకి తీసుకువెళ్ళడం అంత తేలిక కాదు. వీలైతే సపోర్ట్ చేయండి. గైడ్ చేయండి.  నేర్చుకుంటాం. అంతేగాని కిందకు లాగే ప్రయత్నం చేయొద్దు’’ అని కోరారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here