అశోక్ సెల్వ‌న్ లేటెస్ట్ మూవీ ‘ఆకాశం’ … మూడు షేడ్స్‌లో హీరో లుక్స్ విడుదల

0
186

వైవిధ్య‌మైన పాత్ర‌ల‌తో న‌టుడిగా త‌న‌దైన గుర్తింపు సంపాదించుకున్న వెర్సటైల్ యాక్ట‌ర్ అశోక్ సెల్వ‌న్ హీరోగా.. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ వ‌యాకామ్ 18, రైజ్ ఈస్ట్ బ్యాన‌ర్స్ సంయుక్తంగా ఆర్‌.ఎ.కార్తీక్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిస్తోన్న చిత్రం ‘ఆకాశం’. ప్రస్తుతం సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతుంది. ఇందులో ముగ్గురు హీరోయిన్స్ న‌టిస్తున్నారు. వారికి సంబంధించిన క్యారెక్ట‌ర్స్ పేర్లు, వాటి లుక్స్‌ను చిత్ర యూనిట్ ఇటీవలె రిలీజ్ చేయగా మంచి స్పందన వచ్చింది.

వ్య‌వ‌సాయం చేసే రైతు  కుమార్తె మ‌తి పాత్ర‌లో ‘అప‌ర్ణ బాల ముర‌ళి’.. కాలేజ్ స్టూడెంట్ మీనాక్షి పాత్రలో ’శివాత్మిక’.. ట్రావెలింగ్‌ను ఇష్ట‌ప‌డే అమ్మాయి ‘శుభ’ పాత్ర‌లో రీతూ వ‌ర్మ న‌టిస్తున్నారు. అయితే ఈ మూడు పాత్రలకు తగ్గట్టుగా అశోక్ సెల్వన్ మూడు డిఫరెంట్ వేరియేషన్స్‌లో కనిపించారు. అశోక్ సెల్వన్ పాత్రలకు సంబంధించిన పోస్టర్లను మేకర్లు విడుదల చేశారు.

అశోక్ సెల్వన్ ఈ చిత్రంలో వీర, అర్జున్, ప్రభ అనే పాత్రలత్లో కనిపించబోతోన్నారు. ఇక ఇందులో మూడు వేరియేషన్స్ చూపించారు. క్లాస్, మాస్ ఇలా మూడు రకాల వేరియేషన్స్ చూపించారు. ఈ చిత్రానికి గోపీ సుందర్ సంగీతాన్ని అందిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్స్ తెలియజేస్తామని మేకర్స్ తెలిపారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here