స్వర్గీయ ‘కృష్ణంరాజు’ గారి సంతాప సభ

0
18

గుంటూరుకి 38 సార్లు కృష్ణంరాజు…
ప్రముఖ నటుడు కృష్ణంరాజు 11వతేది తెల్లవారుజామున కనుమూసిన సంగతి తెలిసిందే. ఆయన మృతి పట్ల తీవ్ర దిగ్బ్రాంతికి లోనైన ఆయన అభిమాన సంఘ ముఖ్య నాయకుల్లో ఒకరైన

జొన్నలగడ్డ శ్రీరామచంద్ర మూర్తి మాట్లాడుతూ–‘‘ అభిమానులు ఎలా ఉండాలో మా అభిమానులందరికి దగ్గరుండి నేర్పారు కృష్ణంరాజుగారు. 1976 నుండి ఆయన అభిమానిగా ఉన్న నేను కృష్ణంరాజుపేరుతో అభిమాన సంఘం నెలకొల్పి ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించామన్నారు. అనేక కార్యక్రమాల నిర్వహణలో భాగంగా కృష్ణంరాజుగారిని 38 సార్లు గుంటూరుకి ఆహ్వానించాము. మా ఫ్యాన్స్‌తో ఎంతో ఉదారమైన గుణంతో ఉండే కృష్ణంరాజు ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోవటం భరించలేనంత బాధగా ఉందన్నారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన కన్నా లక్ష్మీ నారాయణ మట్లాడుతూ–‘‘ తనదైన శైలీలో, విభిన్న పాత్రల ద్వారా ప్రజల అభిమానాన్ని చూరగొన్న విలక్షణ నటుడు కృష్ణంరాజు అని, తన అభిమానులను సేవా కార్యక్రమాల వైపు తిప్పిన ఘనత కృష్ణంరాజుదే అని తనధైన శైతిలో వ్యక్తపరిచారు. కార్యక్రమంలో మాజీమంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్, ఎం.ఎల్‌.సి ’లక్ష్మణరావు, కన్నా విద్యాసంస్థల అధినేత కన్నా మాష్టారు, విజయవాడ ప్రెస్‌ క్లబ్‌ అధ్యక్షుడు నిమ్మరాజు చలపతిరావు, నందమూరి, అక్కినేని, సూపర్‌ స్టార్‌ అభిమాన సంఘాల నాయకులు పుల్లా సుందరంబాబు, పి. సూరి, కోటశేషగిరి , 32 వ డివిజన్‌ కార్పోరేటర్‌ ఆచారిలు పాల్తొన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో రాళ్లబండి రాజేంద్ర ప్రసాద్, రాళ్ళబండి శివ రామకృష్ణ, మాలెంపాటి లక్ష్మీ ప్రసన్న కుమార్, ఫిలిం పంపిణి దారులు శ్రీనివాసరెడ్డి, శంకర్, రామిరెడ్డి, యాడ్స్‌ కుమార్, గుమ్మడి సీతారామయ్యచౌదరి తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here