శ్రేష్ట్ మూవీస్- సుధాకర్ రెడ్డి- ‘మాచర్ల నియోజకవర్గం’ డబ్బింగ్ మొదలుపెట్టిన నితిన్

0
177

యంగ్ అండ్ వెర్సటైల్ హీరో నితిన్ కథానాయకుడిగా ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పక్కా మాస్, కమర్షియల్ ఎంటర్ టైనర్ ‘మాచర్ల నియోజకవర్గం’ పోస్ట్ ప్రొడక్షన్ పనులు జోరుగా జరుగుతున్నాయి. తాజాగా హీరో నితిన్   హైదరాబాద్ లో నూతనంగా ప్రారంభమైన పప్పు స్టూడియోలో ‘మాచర్ల నియోజకవర్గం’ డబ్బింగ్ ని ప్రారంభించారు. మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదగా పప్పు స్టూడియో గ్రాండ్ గా లాంచ్ అయ్యింది. ఈ స్టూడియోలో మొదట డబ్బింగ్ జరుపుకుంటున్న చిత్రం ‘మాచర్ల నియోజకవర్గం’ కావడం విశేషం.

శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ పై సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. అత్యంత భారీ బడ్జెట్తో భారీ నిర్మాణ ప్రమాణాలు, అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ చిత్రం రూపొందుతోంది. ప్రమోషన్స్ లో దూకుడు చూపిస్తూ రెగ్యులర్ అప్ డేట్స్ తో ప్రేక్షకులని అలరిస్తుంది చిత్ర యూనిట్. ఈ చిత్రం ప్రమోషనల్ మెటిరియల్ కి భారీ రెస్పాన్స్ వస్తోంది. ఇటివల విడుదలైన ‘రారా రెడ్డి’ చార్ట్ బస్టర్ గా యూట్యూబ్ రికార్డ్ వ్యూస్, లైక్స్ తో ట్రెండింగ్ లో వుంది. ఈ స్పెషల్ సాంగ్ లో నితిన్, అంజలి ల కెమిస్ట్రీ, మాస్ డ్యాన్సులు ఫ్యాన్స్ ని అలరిస్తున్నాయి. ఈ చిత్రం నుండి అలాగే తాజాగా విడుదలైన ప్రముఖ నటుడు సముద్రఖని లుక్ కూడా ఆసక్తిని పెంచింది. ఎమ్మెల్యే రాజప్పగా కనిపించిన సముద్రఖని మాచర్ల నియోజకవర్గంపై మరింత క్యూరియాసిటీని పెంచారు.

ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ చిత్రంలో కృతిశెట్టి, కేథరిన్ థ్రెసా కథానాయికలుగా నటిస్తున్నారు. పొలిటికల్ ఎలిమెంట్స్ తో మాస్, కమర్షియల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని రాజ్కుమార్ ఆకెళ్ల సమర్పిస్తున్నారు.

ఈ చిత్రానికి ప్రసాద్ మూరెళ్ల సినిమాటోగ్రాఫర్ పని చేస్తుండగా, మహతి స్వర సాగర్ సంగీతం సమకూరుస్తున్నారు. ఈ చిత్రానికి మామిడాల తిరుపతి డైలాగ్స్ అందించగా, సాహి సురేష్ ఆర్ట్ డైరెక్టర్ గా,  కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్ గా పనిచేస్తున్నారు.  ఈ చిత్రానికి ముగ్గురు ఫైట్ మాస్టర్స్ వెంకట్, రవివర్మ , అనల్ అరసు భారీ యాక్షన్ పార్ట్స్ ని, అదిరిపోయే ఫైట్ సీక్వెన్స్ లని డిజైన్ చేస్తున్నారు.

‘మాచర్ల నియోజకవర్గం’ ఆగస్ట్ 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కానుంది.

తారాగణం: నితిన్, కృతి శెట్టి, కేథరిన్ థ్రెసా, సముద్రఖని అంజలి(స్పెషల్ సాంగ్) తదితరులు
సాంకేతిక విభాగం :
రచన, దర్శకత్వం:  ఎంఎస్ రాజ శేఖర్ రెడ్డి
నిర్మాతలు: సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి
బ్యానర్: శ్రేష్ట్ మూవీస్
సమర్పణ : రాజ్కుమార్ ఆకెళ్ల
సంగీతం: మహతి స్వర సాగర్
డీవోపీ : ప్రసాద్ మూరెళ్ల
ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు
డైలాగ్స్ : మామిడాల తిరుపతి
ఆర్ట్ డైరెక్టర్: సాహి సురేష్
ఫైట్స్: వెంకట్, రవివర్మ, అనల్ అరసు
పీఆర్వో: వంశీ-శేఖర్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here