విజయ్ దేవరకొండ, పాత్ బ్రేకింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ల క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ”లైగర్”(సాలా క్రాస్‌బ్రీడ్) విడుదల తేది దగ్గర పడటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ ని దూకుడుగా చేస్తోంది. లైగర్ నుండి విడుదలైన విజయ్ దేవరకొండ బోల్డ్ పోస్టర్ ఆశ్చర్యానికి గురిచేస్తే, ఫస్ట్ సింగిల్ అక్డీ పక్డీ డ్యాన్స్ నంబర్ ఇంటర్నెట్‌ను షేక్ చేసింది. ఈ పాట ఇప్పటివరకు 30 మిలియన్+ వ్యూస్ తో దేశవ్యాప్తంగా ట్రెండింగ్‌లో వుంది.
ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను జూలై 21న అన్ని భాషల్లో విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ట్రైలర్ అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో చుట్టూ ఫైటర్‌లను వుండగా విజయ్ మధ్యలో వుండి ఫైట్ కి సిద్ధమవ్వడం గమనించవచ్చు.
లైగర్ యూనిట్ విడుదల చేసిన ఫస్ట్ గ్లింప్స్ లో విజయ్ దేవరకొండను ఎంఎంఎ ఫైటర్‌గా ప్రజంట్ చేసి థ్రిల్లర్ రైడ్ ని ప్రామిస్ చేసింది చిత్ర యూనిట్. ఫస్ట్ గ్లింప్స్ లో విజయ్ దేవరకొండపై మాత్రమే దృష్టి పెట్టారు. మరో ఐదు రోజుల్లో విడుదల కానున్న ట్రైలర్.. మైక్ టైసన్‌తో సహా ఇతర నటీనటులు, సినిమా కంటెంట్ గురించి మరిన్ని వివరాలను వెల్లడించనుంది.
లైగర్ లో విజయ్ దేవరకొండ సరసన అనన్య పాండే కథానాయికగా నటిస్తుంది. పూరి కనెక్ట్స్ , బాలీవుడ్ స్టార్ ప్రొడక్షన్ కంపెనీ ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్, కరణ్ జోహర్, అపూర్వ మెహతా సంయుక్తంగా సినిమాను ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు.
విష్ణు శర్మ సినిమాటోగ్రాఫర్‌గా, థాయ్‌లాండ్‌కు చెందిన కెచా స్టంట్ మాస్టర్ గా ఈ చిత్రానికి పని చేస్తున్నారు.
హిందీ, తెలుగు, తమిళం, కన్నడ , మలయాళం భాషల్లో రూపొందుతున్న ఈ పాన్ ఇండియా చిత్రం 2022 ఆగస్టు 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
తారాగణం: విజయ్ దేవరకొండ, అనన్య పాండే, రమ్య కృష్ణ, రోనిత్ రాయ్, విషు రెడ్డి, అలీ, మకరంద్ దేశ్ పాండే, గెటప్ శ్రీను
సాంకేతిక విభాగం:
దర్శకత్వం: పూరీ జగన్నాథ్
నిర్మాతలు: పూరీ జగన్నాథ్, ఛార్మీ కౌర్, కరణ్ జోహార్, అపూర్వ మెహతా
బ్యానర్లు: పూరి కనెక్ట్స్, ధర్మ ప్రొడక్షన్స్
డీవోపీ: విష్ణు శర్మ
ఆర్ట్ డైరెక్టర్: జానీ షేక్ బాషా
ఎడిటర్: జునైద్ సిద్ధిఖీ
స్టంట్ డైరెక్టర్: కేచ