మారుతి, సంతోష్ శోభన్ కాంబినేషన్‌లో ‘మంచి రోజులు వచ్చాయి’ నుంచి ఎనర్జిటిక్ ‘ఎక్కేసిందే’ లిరికల్ సాంగ్ కు అనూహ్య స్పందన

0
322

యువీ కాన్సెప్ట్స్, మాస్ మూవీ మేకర్స్ సంయుక్తంగా వరస విజయాలతో దూసుకుపోతున్న దర్శకుడు మారుతి రూపొందిస్తున్న కొత్త సినిమా మంచి రోజులు వచ్చాయి. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ఫస్ట్ లుక్‌తో పాటు టీజర్‌, సోసోగా ఉన్నా పాటకు అద్భుతమైన స్పందన వచ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి ఎక్కేసిందే లిరికల్ సాంగ్ విడుదలైంది. ఫాస్ట్ పెప్పిగా ఉన్న ఈ పాటకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. రామ్ మిరియాల ఈ పాట పాడారు. అనూప్ రూబెన్స్ అందించిన ట్యూన్ సూపర్ హిట్ అయింది.
హైదరాబాద్ కేబుల్ బ్రిడ్జి సమీపంలోని అందమైన లొకేషన్స్ లో ఈ పాటను చిత్రీకరించారు. మహానుభావుడు లాంటి సూపర్ హిట్ తర్వాత మారుతి కాంబినేషన్‌లో మెహ్రీన్ కౌర్ ఫిర్జాదా హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమాను వి సెల్యులాయిడ్ SKN నిర్మిస్తున్నారు. టాక్సీవాలా తర్వాత ఈయన నిర్మాణంలో వస్తున్న సినిమా ఇది. మారుతి, వి సెల్యులాయిడ్ SKN అంటే సూపర్ హిట్ కాంబినేషన్. ఈ కాంబోలో ఇప్పుడు మంచి రోజులు వచ్చాయి సినిమా వస్తుంది. ఏక్ మినీ కథ లాంటి హిట్ సినిమాను నిర్మించిన యూవీ కాన్సెప్ట్స్‌తో మరోసారి జోడీ కట్టాడు సంతోష్ శోభన్. ఎక్కేసిందే పాటలో సంతోష్ శోభన్, మెహిరీన్ కెమిస్ట్రీ బాగుంది. సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. మిగిలిన వివరాలు దర్శక నిర్మాతలు త్వరలోనే తెలియజేయనున్నారు.

నటీనటులు: సంతోష్ శోభన్, మెహ్రీన్ కౌర్ ఫిర్జాదా..

టెక్నికల్ టీం:
కథ, స్క్రీన్ ప్లే, దర్శకుడు: మారుతి
నిర్మాత: వి సెల్యూలాయిడ్ SKN
బ్యానర్స్: యువీ కాన్సెప్ట్స్, మాస్ మూవీ మేకర్స్
సినిమాటోగ్రఫీ: సాయి శ్రీరామ్
సంగీతం: అనూప్ రూబెన్స్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here