బీఏ రాజు మరణం పరిశ్రమకు లోటు – నిర్మాత చందన్ రెడ్డి  

0
359

జర్నలిస్ట్, సూపర్‌హిట్ పత్రికాధినేత, పీఆర్వో, నిర్మాత బీఏ రాజు మరణం చిత్ర పరిశ్రమకు తీరని లోటు అని కామాక్షి మూవీస్ అధినేత డి. శివప్రసాద్ రెడ్డి తనయుడు, నిర్మాత చందన్ రెడ్డి అన్నారు. బీఏ రాజు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

చందన్ రెడ్డి మాట్లాడుతూ “బీఏ రాజుగారితో మా కుటుంబానిది 30 సంవత్సరాల అనుబంధం. మా  నాన్నగారు శివప్రసాద్ రెడ్డికి ఆయన అడ్వైజర్. మా కామాక్షి మూవీస్ సంస్థకు బ్యాక్ బోన్. సినిమా పరిశ్రమలో అన్ని శాఖల మీద అవగాహన ఉన్న వ్యక్తి. వ్యక్తిగతంగా మా కుటుంబానికి మాత్రమే కాదు, చిత్ర పరిశ్రమకు బీఏ రాజు మరణం తీరని లోటు” అని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here