అనాథ పిల్ల‌ల‌కు అండ‌గా నిల‌బ‌డిన హీరో సందీప్ కిష‌న్

0
12

ప్ర‌స్తుతం ప్ర‌పంచం మొత్తాన్నిక‌రోనాతో వ‌ణికిస్తోంది ఏ స‌మ‌యంలో ఎవ‌రికీ ఏం జ‌రుగుతుందో కూడా
తెలియ‌ని పరిస్థితి. సినీ సెల‌బ్రిటీలు త‌మ వంతు బాధ్య‌త‌గా ఆక్సిజన్‌, వెంటిలేటర్లు, ఇంజక్షన్ల సమాచారం ఎప్పటికప్పుడు అందిస్తూ.. కరోనాతో బాధపడుతున్న వారికి అండగా నిలబడుతున్నారు. అయితే కరోనా మహమ్మారి వల్ల పెద్ద దిక్కును కోల్పోయి అభం శుభం తెలియని పసివాళ్లు ఎంతో మంది అనాథలుగా మారుతున్నారు. వారికి అండ‌గా ఉంటాన‌ని తెలిపి అంద‌రి మ‌న‌సుల్ని గెలుచుకున్నారు యంగ్ హీరో సందీప్ కిష‌న్‌.

.‘‘ఇది చాలా కఠినమైన సమయం. మీ చుట్టుప‌క్క‌ల కరోనా వల్ల పెద్ద దిక్కును కోల్పోయి అనాథలుగా మారిన చిన్నారుల వివరాలు sundeepkishancovidhelp@gmail.com కు తెలియజేయండి. నేను, నా టీమ్‌ కలిసి మాకు చేతనైనంత వరకు వాళ్లను సంరక్షిస్తాం. మంచి ఆహారం అందించడంతో పాటు కొన్నేళ్లు వారిని చదివిస్తాం. మానవత్వం కలిగిన మనుషులుగా ఒకరికొకరు అండగా నిలవాల్సిన సమయం ఇది. ఇంట్లోనే ఉండండి.. జాగ్రత్తలు పాటించండి.. మీరు కూడా మీకు తోచినంత సాయం చేయండి’ అని పేర్కొన్నారు యంగ్ హీరో సందీప్ కిష‌న్‌.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here