30 మిలియ‌న్ల‌కి పైగా వ్యూస్‌తో దూసుకుపోతున్న `లాహే లాహే సాంగ్‌`

0
15

మెగాస్టార్ చిరంజీవి టైటిల్ పాత్ర‌ధారిగా స్టార్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న భారీ చిత్రం `ఆచార్య‌`. కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ, మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకాల‌పై నిరంజ‌న్ రెడ్డి, రామ్‌చ‌ర‌ణ్ ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ `సిద్ధ`గా ఒక ప‌వ‌ర్‌ఫుల్ పాత్ర‌లో న‌టిస్తున్నారు. ఇప్ప‌టికే విడుద‌ల‌చేసిన టీజ‌ర్‌కు సూప‌ర్బ్ రెస్పాన్స్ వ‌చ్చింది. కాగా ఇటీవ‌ల విడుద‌ల చేసిన `లాహే లాహే సాంగ్‌`కి కూడా ట్రెమెండ‌స్ రెస్పాన్స్ వ‌స్తోంది. ఆధిత్య మ్యూజిక్ ద్వారా విడుద‌లైన ఈ పాట విశేష ఆద‌ర‌ణతో యూ ట్యూబ్‌లో 30 మిలియ‌న్స్‌కి పైగా వ్యూస్ సాధించింది. దీంతో పాటు ఆచార్య నుంచి విడుద‌లైన ర‌షెస్‌కు అద్బుత‌మైన స్పంద‌న వ‌స్తోంది. తాజాగా దేశంలో నెల‌కొన్న కొవిడ్ సెకండ్ వేవ్ ప‌రిస్థితుల దృశ్యా ఈ చిత్ర విడుద‌ల‌ని వాయిదా వేసిన విష‌యం తెలిసిందే..

మెగాస్టార్ చిరంజీవి, రామ్ చ‌ర‌ణ్‌, కాజ‌ల్ అగ‌ర్వాల్‌, పూజా హెగ్డే, సోనూసూద్ త‌దిత‌రులు న‌టిస్తోన్న ఈ చిత్రానికి ఎడిట‌ర్‌: న‌వీన్ నూలి, ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌: సురేష్ సెల్వరాజ్‌, సినిమాటోగ్ర‌ఫీ: ఎస్‌.తిరుణ్ణావుక్క‌ర‌సు, మ్యూజిక్‌: మణిశ‌ర్మ‌, నిర్మాత‌లు: నిరంజ‌న్ రెడ్డి, రామ్ చ‌ర‌ణ్‌, ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం: కొర‌టాల శివ‌.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here