త‌మ‌న్నా ప్ర‌ధాన పాత్ర‌లో `న‌వంబ‌ర్ స్టోరీ`, మే 14న డిస్నీ+హాట్‌స్టార్ లో విడుద‌ల

0
13

స్టార్‌హీరోయిన్ త‌మ‌న్నా ఈ ఏడాది `లెవెన్త్ హ‌వర్` ప్రాజెక్టుతో డిజిట‌ల్ ప్లాట్‌ఫామ్‌పైకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్ర‌వీణ్ స‌త్తారు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సిరీస్ ఆహాలో మంచి రెస్పాన్స్ రాబ‌ట్టుకుంది. తాజాగా మ‌రో ఓటీటీ ప్రాజెక్టుతో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది త‌మ‌న్నా. డిస్నీ+హాట్‌స్టార్ స‌మ‌ర్ప‌ణ‌లో క్రైం థ్రిల్ల‌ర్ గా రూపొందిన `న‌వంబ‌ర్ స్టోరీ` మే 14న విడుద‌ల కానుంది. తండ్రీ కూతుళ్ల రిలేష‌న్ షిప్ నేప‌థ్యంలో ఈ ప్రాజెక్టు సాగ‌నుంద‌ని తెలుస్తోంది. ఇందులో అనురాధ అనే యువ‌తి పాత్ర‌లో త‌మ‌న్నా క‌నిపించ‌బోతుంది. జీఎం కుమార్, ప‌శుప‌తి, వివేక్ ప్ర‌స‌న్న న‌మిత కృష్ణ‌మూర్తి సిరీస్‌లో ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఇంద్ర సుబ్ర‌మ‌ణియ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఆనంద విక‌ట‌న్ నిర్మిస్తున్న నవంబ‌ర్ స్టోరీ తెలుగు, త‌మిళం, క‌న్న‌డం, మ‌ల‌యాళం, హిందీ భాష‌ల్లో విడుద‌ల కానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here