మనం ఈ కష్టకాలాన్ని అధిగమిస్తాం – స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి

0
13

కరోనా సెకెండ్‌ వేవ్‌ కోరలు చాస్తున్న సమయంలో పలువురు సినీ రాజయకీయ ప్రముఖులు జాగ్రత్తగా ఉండాలంటూ ప్రజలకు సందేశాలు ఇస్తు వారిలో ధైర్యాన్ని నింపుతున్నారు. తాజాగా ప్రజలకు సందేశాన్ని ఇచ్చారు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి. ఈ మేరకు త‌న ట్విట్టర్‌లో ఓ లెటర్‌ పోస్ట్‌ చేశారు. ‘ ‘ప్రస్తుత క్టిష్ట పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ బాగున్నారని అనుకుంటున్నాను. పోయిన వారిని తిరిగి ఎప్పటికీ తీసుకురాలేము. అయితే ఈ కరోనాకు మరొకరు బలికాకుండా మాత్రం జాగ్రత్త పడగలం. ఇందుకోసం ఒకరికొకరం సాయం చేసుకుంటూ ముందుకు సాగాలి. దీని నుంచి బయటప పడాలంటే అందరూ ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ.. వీలైనంతవరకు ఇంట్లోనే ఉండేందుకే ప్రయత్నించండి మీకు మీరే స్వీయ నిర్భంధాన్ని విధించుకోండి. మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో మాట్లాడుతూ ఉండండి. వారితో సమయాన్ని గడ‌పండి. ప్రతీ ఒక్కరికీ వారి బాధను ఎలా చెప్పుకోవాలో తెలిసి ఉండకపోవచ్చు. అందరూ శ్వాసకు సంబంధించిన వ్యాయామాలు చేయండి. ఈ సమయంలో పాజిటివ్‌ ఎనర్జీ చాలా అవసరం. అలాగే ఇతరులకు చేతనైన సాయం చేయండి. అది ప్రార్థనలైనా కావచ్చు. మనం ఈ కష్టకాలాన్ని అధిగమిస్తాం. నెగెటివిటీ మీద దృష్టి పెట్టి మనకున్న శక్తిని వృథా చేసుకోవద్దు. మానవ శక్తిని మనమంతా కలిసి బయటకు తీసుకురావచ్చు“ అని పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here