ఆక‌ట్టుకుంటోన్న వ‌కీల్ సాబ్ చిత్రంలోని `కంటిపాప కంటిపాప` ఫుల్ వీడియో సాంగ్

0
13

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ లేటెస్ట్ సెన్సేష‌న్ ‘వకీల్‌ సాబ్’ చిత్రం నుండి ఇప్పటికే విడుదలైన ‘మగువా మగువా’ ఫిమేల్‌ వెర్షన్‌ ఫుల్‌ వీడియో సాంగ్‌ ప్రేక్షకుల‌నుండి విశేష ఆద‌ర‌ణ పొందుతోంది. తాజాగా ఈ మూవీ నుండి మరో ఫుల్ వీడియో సాంగ్‌ వచ్చేసింది. పవన్‌ కల్యాణ్‌, శ్రుతి హాసన్‌పై తెరకెక్కిన మెలోడీ `కంటిపాప కంటిపాప` ఫుల్ వీడియో సాంగ్ ని విడుదల చేసింది చిత్ర బృందం. ఈ పాటలో పవన్‌, శ్రుతి కెమిస్ట్రీ ఆకట్టుకుంటోంది. ప‌వ‌న్ శృతిల మ‌ధ్య ప్రేమ‌,పెళ్లి, సీమంతం తదితర సన్నివేశాలు అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరిస్తున్నాయి. స్టార్ లిరిసిస్ట్ రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ గీతాన్ని అర్మాన్‌ మాలిక్‌, దీపు, తమన్‌ ఆలపించారు. లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేష‌న్ త‌మ‌న్ స్వరాలు సమకూర్చారు. ఇటీవల థియేటర్లో ఘ‌న విజ‌యం సాధించిన ఈ చిత్రం ప్రస్తుతం అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో వేదికగా అలరిస్తోంది. బోనీ క‌పూర్ స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ‌వేంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ ప‌తాకంపై ప్ర‌ముఖ నిర్మాత‌లు దిల్‌రాజు, శిరీష్ నిర్మించారు. అంజలి, నివేదా థామస్, అనన్య, ప్రకాశ్ రాజ్‌ కీలక పాత్రలు పోషించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here