శ్రేయా గోషాల్… మధురగాయనిగానే కాకుండా మంచి మనసున్న వ్యక్తిగా అందరికీ పరిచయమే…ప్రస్తుతం కరోనా సెకండ్‌వేవ్ రూపంలో విలయతాండవం చేస్తున్న వేళ ఆమె కోవిడ్ 19 బాధితులకు వైద్యం, అందిస్తూ, సేవలు చేస్తున్న వైద్య సిబ్బందికి, ఫ్రంట్ లైన్ వారియర్స్ కి ఆమె చేతులు జోడించి నమస్కరించారు.తన అధికారక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ‘‘డాక్టర్లు, నర్సులు, వైద్య సిబ్బంది, అంబులెన్స్ డ్రైవర్లు కోసం బయట ప్రార్ధనలు జరుగుతున్నాయి. మీరు అందిస్తున్నసేవలు మాటల్లో వర్ణించలేము. నిద్ర, విరామం లేకుండా మీ జీవితాలను ఫణంగా పెట్టి రోగులకు సేవలు అందిస్తున్నారు. దేవుడు మీ రూపంలో సేవలు అందిస్తున్నాడు. దేశమంతా మీ సేవలకు చేతులు జోడించి నమస్కరిస్తుంది’’ అని శ్రేయాగోషాల్ పేర్కొన్నారు.



