`స్వ‌` మూవీ ఫ‌స్ట్‌ లుక్ రిలీజ్ చేసిన ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు క్రిష్‌

0
366

జీఎమ్ఎస్ గ్యాల‌రీ ఫిలిమ్స్ ప‌తాకంపై జి ఎమ్ సురేష్ నిర్మిస్తోన్న తొలిచిత్రం `స్వ‌`. మహేష్ యడ్లపల్లి హీరోగా న‌టిస్తున్న ఈ చిత్రానికి మ‌ను ద‌ర్శ‌కత్వం వ‌హించారు. చిత్రీక‌ర‌ణ పూర్తిచేసుకుని ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్స్ జ‌రుపుకుంటోన్న ఈ మూవీ ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్‌ని ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు క్రిష్ విడుద‌ల‌ చేశారు.

ఈ సంద‌ర్భంగా క్రిష్ మాట్లాడుతూ – “స్వ ఫ‌స్ట్‌లుక్ చాలా బాగుంది. సినిమా కాన్సెప్ట్ కూడా నాకు బాగా న‌చ్చింది. మంచి కాన్సెప్ట్‌తో వస్తున్న ఇలాంటి చిన్న చిత్రాల‌ను అంద‌రూ ఆదిరించాలి. టీమ్ అంద‌రికీ ఆల్ ది బెస్ట్‌“ అన్నారు.

ఈ కార్యక్రమంలో దర్శకుడు మను హీరో మహేష్ యడ్లపల్లి, సంగీత దర్శకులు కరణం శ్రీ రాఘవేంద్ర, కెమెరామెన్ దేవేంద్ర సూరి, నటుడు సిద్ధార్థ్ మరియు జానగని కార్తిక్ లు పాలుగొన్నారు. స్వాతి భీమిరెడ్డి, యశ్వంత్, మానిక్ రెడ్డి, సిద్దార్థ్ ఇందులో ముఖ్య తారాగణంగా నటించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here