నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ కమలాకర్ రెడ్డి మృతి

0
528
కెఎఫ్‌సీ నిర్మాణ సంస్థ అధినేత, నిర్మాత కమలాకర్ రెడ్డి

కెఎఫ్‌సీ నిర్మాణ సంస్థ అధినేత, నిర్మాత కమలాకర్ రెడ్డి రోడ్డు ప్రమాదంలో కన్నుమూసారు. ఇటీవలే కమలాకర్ రెడ్డి తండ్రి నందగోపాల్ రెడ్డికి కరోనా పాజిటివ్ అని తేలింది. మెరుగైన చికిత్స కోసం అంబులెన్స్‌లో హైదరాబాద్‌కు వస్తుండగా నల్గొండ జిల్లా దామరచర్ల మండలం కొండ్రపోల్‌లో ఆగివున్న లారీని అంబులెన్స్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కమలాకర్ రెడ్డితో పాటు ఆయన తండ్రి కూడా అక్కడికక్కడే మృతి చెందారు. ఈ మధ్యే విడుదలైన కనులు కనులు దోచాయంటే సినిమాను కేఎఫ్‌సి ఎంటర్‌టైన్మెంట్ సంస్థ తెలుగులో విడుదల చేసింది. ఈయన మృతి పట్ల తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ సంతాపం వ్యక్తం చేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here