గ్రీన్ ఛాలెంజ్ స్వీకరించిన టాలీవుడ్ లేడీ డైరెక్టర్ సంజనరెడ్డి సోమజిగూడలోని తన నివాసంలో మొక్కలు నాటారు

0
343
డైరెక్టర్ సంజనరెడ్డి

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు నిర్వహిస్తున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం అపురూపంగా ముందుకు సాగుతున్నది. రాష్ట్రంలో వర్షాలు జోరుగా పడుతుండటంతో మొక్కలు నాటడం ఒక పండగల నడుస్తుంది. గ్రీన్ ఛాలెంజ్ని స్వీకరించిన టాలీవుడ్ లేడీ డైరెక్టర్, కరణం మల్లీశ్వరి బయోపిక్ మూవీని డైరక్ట్ చేయబోతున్న సంజనరెడ్డి ఈ రోజు సోమజిగూడలోని తన నివాసంలో మూడు మొక్కలు నాటారు.ఎంపీ సంతోష్ గారు నిర్వహిస్తున్న గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమాన్ని చూసి స్వతహాగా ఈ రోజు గ్రీన్ ఛాలెంజ్ లో భాగస్వామ్యం అయ్యారు డైరెక్టర్ సంజనరెడ్డి.

గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటడం తనకు చాలా ఆనందంగా ఉందనీ, ఇంత మంచి కార్యక్రమంలో తననీ భాగస్వామ్యం చేసినందుకు ఎంపీ సంతోష్ గారికి కృతజ్ఞతలు తెలిపారు.అదే విధంగా ప్రముఖ వెయిట్ లిఫ్టర్ కరణం మల్లేశ్వరికి,హీరో రాజ్ తరుణ్,సినీ రచయిత కోన వెంకట్,హీరోయిన్ ఐశ్వర్య అర్జున్,సందీప్ చితుకుల గార్లకు తలా మూడు మొక్కలు నాటల్సిందిగా కోరింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here