గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య

0
441
యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య 

గౌరవ రాజ్యసభ శ్రీ జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అన్ని సామాజిక వర్గాలకు చేరువైంది , చిన్న పిల్లల నుండి వయోవృద్ధుల వరకు ,కార్యకర్త నుండి ప్రధాన కార్యదర్శుల వరకు , కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు , కోటా నుండి కోలకతా వరకు , సెర్చ్ ఇంజిన్ లో టాప్ , ట్రెండింగ్ లో హిస్టరీ , ఆల్ ఇండియా లో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ , ఇలా ప్రతి ఒక్కరూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ని ఆదరిస్తున్నారు , ఆశీర్వదిస్తున్నారు .. ఇందులో భాగంగా యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య  గచ్చ్చిబౌలి లోని తన నివాసం లో మొక్కలు నాటారు.

ఈ సందర్బంగా యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య మాట్లాడుతూ మనకు జీవించటానికి భూమి ఒక్కటే ఆధారం , మనకు వేరే ఆధారం ఇప్పటివరకు లేదు , ఆలాంటి భూమిని కాపాడాలి అంటే విరివిగా మొక్కలు నాటాలి ,మన అవగాహనా లోపం తో మనం మొక్కలు నాటడం అశ్రద్ధ చేస్తున్నాం కానీ అల చేయకుండా ఈ ఇలాంటి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం లో పాల్గొనాలి అని , ఇలాంటి అద్భుత కార్యక్రమం చేపట్టిన ఎంపీ సంతోష్ కుమార్ గారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నా … ఈ కార్యక్రమం ఇలానే ముందుకు కొనసాగడానికి నా వంతుగా మరో ముగ్గురు యాక్టర్ సుశాంత్ , డైరెక్టర్ శివ నిర్వణ , నటి రకుల్ ప్రీత్ సింగ్ , డైరెక్టరు విక్రమ్ కె కుమార్ గార్లని గ్రీన్ ఛాలెంజ్ కి నామినేషన్ చేశారు .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here