తెలుగు, తమిళ‌, హిందీ , మలయాళ భాషల్లో విడుద‌లైన రెబల్ స్టార్ ప్రభాస్ `రాధేశ్యామ్` ఫ‌స్ట్‌లుక్

0
190
Radhe shyam First look

బాహుబలి, సాహో వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీస్ త‌ర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా జిల్ ఫేమ్ రాధాకృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం రాధేశ్యామ్‌. రెబ‌ల్‌స్టార్ డా. యూవీ కృష్ణంరాజు స‌మ‌ర్ప‌ణ‌లో గోపికృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ ప‌తాకాల‌పై వంశీ, ప్ర‌మోద్, ప్ర‌సీద ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్ర‌భాస్ స‌ర‌స‌న పూజా హెగ్దే హీరోయిన్‌గా న‌టిస్తోంది. ప్ర‌ముఖ విఎఫ్ఎక్స్ టెక్నీషియ‌న్‌ క‌మల్ కన్నన్ ఈ చిత్రానికి విఎఫ్ఎక్స్ విభాగంలో పని చేస్తుండడం విశేషం. జులై 10 ఉదయం 10 గంటలకు రాధేశ్యామ్ ఫస్ట్ లుక్, టైటిల్ పోస్ట‌ర్‌ను తెలుగు, తమిళ్, హిందీ , మలయాళ భాషల్లో విడుద‌ల చేసింది చిత్ర యూనిట్‌. రాధేశ్యామ్ చిత్రం ఫ‌స్ట్‌లుక్ లో ప్ర‌భాస్ పూజా హెగ్దే రోమాంటిక్‌గా నిల‌బ‌డిన తీరు ఆక‌ట్టుకుంటోంది. క్రియేటివ్ గా ఉన్న‌ ఈ పోస్ట‌ర్ కు అన్ని భాష‌ల‌లో మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. ఇప్ప‌టికే కీల‌క స‌న్నివేశాల‌కి సంబంధించిన షూటింగ్ పార్ట్‌ని ముగించిన‌ట్లుగా చిత్ర బృందం తెలిపింది. కోవిడ్ 19 క్రైసిస్ ముగిసిన వెంట‌నే ఈ సినిమాకి సంబంధించి మిగిలి ఉన్న షూటింగ్ పార్ట్‌ని కంప్లీట్ చేసి పాన్ ఇండియా మూవీగా భారీ ఎత్తున రిలీజ్ చేయ‌డానికి నిర్మాత‌లు వంశీ, ప్ర‌మోద్, ప్ర‌సీదలు స‌న్నాహాలు చేస్తున్నారు.

రెబ‌ల్‌స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే, బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ భాగ్యశ్రీ ,హాస్యనటుడు ప్రియదర్శి, సచిన్ ఖేడేకర్, మురళీ శర్మ, సాషా ఛేత్రి, కునాల్ రాయ్ కపూర్, సత్యన్ త‌దిత‌రులు న‌టిస్తోన్న ఈ చిత్రానికి

సాంకేతిక నిపుణులు:
సినిమాటోగ్రఫీ : మనోజ్ పరమహంస,
ఎడిటర్ : కోట‌గిరి వెంక‌టేశ్వ‌ర‌రావు,
ప్రొడక్షన్ డిజైనర్ : రవీందర్,
సమర్పణ : యూవీ కృష్ణం రాజు,
బ్యానర్ : గోపికృష్ణ మూవీస్‌, యూవీ క్రియేషన్స్,
నిర్మాతలు: వంశీ – ప్ర‌మోద్ – ప్ర‌సీద‌,
దర్శకుడు : కె. కె.రాధాకృష్ణ కుమార్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here