మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం కరోనా కారణంగా నడుస్తోన్న లాక్ డౌన్ సమయాన్ని తన ఫ్యామిలీ తో కలిసి సరదాగా గడుపుతున్నారు. ఇటీవల తండ్రి మెగాస్టార్ చిరంజీవి, తల్లి సురేఖ, భార్య ఉపాసన, నానమ్మ అంజనమ్మలతో కలిసి సరదాగా ఎంజాయ్ చేస్తున్న పలు ఫోటోలు పోస్ట్ చేసిన రామ్ చరణ్, నేడు తన జిమ్ లో వర్కౌట్స్ చేసిన అనంతరం మ్యాట్ గా సేదతీరుతున్న ఫోటోలను సోషల్ మీడియా అకౌంట్స్ లో పోస్ట్ చేసారు.
‘మెదడు జిమ్ చేయమంటోంది, మరి మనసేమో…’ అంటూ పోస్ట్ చేసారు చరణ్. కాగా అతి త్వరలో రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’ తదుపరి షెడ్యూల్ లో రామ్ చరణ్ పాల్గొననున్నారు. రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్న ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమరం భీంగా నటిస్తున్న విషయం తెలిసిందే…!!
Head say gym💪 &
Heart says 🤔hmmmm… pic.twitter.com/zoNNHz6Sxt— Ram Charan (@AlwaysRamCharan) July 10, 2020



