50 వసంతాలు పూర్తి చేసుకున్న ‘సూపర్ స్టార్ కృష్ణ’ గారి ‘పద్మాలయ స్టూడియోస్’ బ్యానర్…..!!

0
475
పద్మాలయ స్టూడియోస్

టాలీవుడ్ లెజెండరీ యాక్టర్ ఘట్టమనేని సూపర్ స్టార్ కృష్ణ గారు నటుడిగా తొలి సినిమా తేనెమనసులు నుండి తెలుగు ప్రేక్షకుల అభిమానం చూరగొని, మొత్తంగా తన కెరీర్ లో 350కి పైగా సినిమాలు చేసారు. అప్పట్లో టాలీవుడ్ కి ఎన్నో సరికొత్త టెక్నాలజీలను పరిచయం చేసిన కృష్ణ గారు, పలు రకాల సరికొత్త జానర్లలో కూడా సినిమాలు చేసి ఎన్నో గొప్ప విజయాలు అందుకున్నారు. అనంతరం సరిగ్గా 1971లో తన సోదరులు హనుమంతరావు, ఆదిశేషగిరిరావు లతో కలిసి పద్మాలయ స్టూడియోస్ పేరుతో బ్యానర్ ని స్థాపించి ఎన్నో సక్సెస్ఫుల్ సినిమాలు నిర్మించారు. అప్పట్లో తొట్టతొలి కౌబోయ్ సినిమాగా తెరకెక్కిన మోసగాళ్లకు మోసగాడు, పద్మాలయ వారు నిర్మించిన సినిమా.

తమ బ్యానర్ పై నిర్మించిన మోసగాళ్ళకు మోసగాడు సినిమాతో అతి పెద్ద విజయాన్ని అందుకున్న పద్మాలయ స్టూడియోస్ బ్యానర్ పై ఆ తరువాత నుండి వరుసగా ఎన్నో సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. తెలుగు సహా, హిందీ, తమిళ్, కన్నడ భాషల్లో కూడా తమ బ్యానర్ పై సినిమాలు నిర్మించారు ఘట్టమనేని సోదరులు. కాగా నేటితో ఆ సక్సెస్ఫుల్ బ్యానర్ పద్మాలయ స్టూడియోస్ 50 వసంతాలు పూర్తి చేసుకోవడంతో పలువురు ప్రేక్షకులు, సూపర్ స్టార్ కృష్ణ, మహేష్ బాబు గార్ల అభిమానులు, ప్రేక్షకులు సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా అభినందనలు తెలియచేస్తున్నారు…..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here