ఈ ఏడాది ఇప్పటికే సరిలేరు నీకెవ్వరు తో ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ అందుకున్న మహేష్ బాబు, ప్రస్తుతం కరోనా కారణంగా లాక్ డౌన్ కొనసాగుతుండడంతో తన ఫ్యామిలీ తో కలిసి ఇంట్లో సరదాగా గడుపుతున్నారు. ఇక చిన్నతనం నుండి తండ్రి కృష్ణ గారి ప్రోద్బలంతో సినిమాల్లోకి ప్రవేశించిన మహేష్ బాబు, ఆయనతో అప్పటి నుండి ఎంతో ప్రత్యేకమైన అనుబంధం కలిగి ఉండేవారు. ప్రస్తుతం ఎంత ఎత్తుకు ఎదిగినప్పటికీ కూడా తాను మాత్రం ఎప్పటికీ కృష్ణ గారి అబ్బాయిని అని చెప్పుకోవడానికి ఇష్టపడతాను అని మహేష్ బాబు తరచూ అంటుంటారు.
ఇకపోతే కొన్నేళ్ల క్రితం తన సోదరి ప్రియదర్శిని వివాహ సమయంలో తండ్రి కృష్ణ తో కలిసి దిగిన అప్పటి ఫోటోని తన సోషల్ మీడియా మాధ్యమం ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన మహేష్ బాబు, నాన్న ముఖం మీద చెదరని ఆ చిరునవ్వు ఎంతో విలువైనది అంటూ అప్పటి జ్ఞాపకాలు గుర్తుచేసుకున్నారు. కాగా ప్రస్తుతం ఆ ఇద్దరు సూపర్ స్టార్స్ కలిసి దిగిన ఆ ఫోటో పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో ఎంతో వైరల్ అవుతోంది…!!