సూపర్ స్టార్ మహేష్ బాబు, ఈ లాక్ డౌన్ సమయాన్ని తన ఫ్యామిలీతో కలిసి సరదాగా గడుపుతున్నారు. కూతురు సితార, కుమారుడు గౌతమ్ లతో కలిసి సరదా ఆటలు ఆడుతూ, అలానే పలు సినిమాలు, వెబ్ సిరీస్ ల వంటివి చూస్తూ కాలక్షేపం చేస్తున్నారు. ఇకపోతే నేడు ప్రముఖ ఓటిటి మధ్యమం నెట్ ఫ్లిక్స్ లో ప్రసారం అయ్యే జర్మన్ బేస్డ్ వెబ్ సిరీస్ ‘డార్క్’ ఎంతో బాగుంది అంటూ సూపర్ స్టార్ మహేష్ తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా ఒక పోస్ట్ చేసారు. ‘అద్భుతమైన కథ, కథనాలతో ఆకట్టుకునే స్క్రిప్ట్ తో రూపొందించబడ్డ డార్క్ వెబ్ సిరీస్ తనకు ఎంతో నచ్చిందని, వీలైతే మీరు కూడా దానిని చూడండి’ అంటూ మహేష్ తన ట్వీట్ ద్వారా ప్రేక్షకులకు తెలిపారు సూపర్ స్టార్.