రెండోసారి కూడా బుల్లితెరపై ప్రభంజనాన్ని సృష్టించిన సూపర్ స్టార్ మహేష్ ‘సరిలేరు నీకెవ్వరు’…..!!

0
408
Superstar Mahesh

సూపర్ స్టార్ మహేష్ బాబు, యువ సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ల కాంబినేషన్లో ఈ ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. మహేష్ బాబు, మిలిటరీ మేజర్ అజయ్ కృష్ణగా అద్భుత నటనను కనబరిచిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా ఇటీవల తొలిసారిగా బుల్లితెర పై ప్రదర్శితమైన ఏకంగా 23.4 టీఆర్పి రేటింగ్స్ ని దక్కించుకుని టాలీవుడ్ సినిమాల్లో అత్యధిక రేటింగ్స్ సాధించిన సినిమాగా రికార్డు ని సొంతం చేసుకుంది.

ఇకపోతే మొన్న ఆదివారం రెండవసారి ప్రదర్శితమైన ఈ సినిమా 17.4 టీఆర్పీ రేటింగ్స్ సాధించి రెండో సారి ప్రసారంలో కూడా సంచలనం సృష్టించింది. కాగా పరశురామ్ పెట్ల దర్శకత్వంలో అతి త్వరలో తదుపరి సినిమా ‘సర్కారు వారి పాట’లో మహేష్ బాబు నటించనున్న విషయం తెలిసిందే…..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here