‘బ్రీత్‌: ఇన్‌ టు ది షాడోస్‌’ వెబ్ సిరీస్లో న‌టిస్తోన్ననిత్య మీన‌న్‌‌.‌

0
721
హీరోయిన్ నిత్యామీన‌న్

అలా మెద‌లైంది, ఇష్క్‌, గుండె జా‌రీ గ‌ల్లంత‌య్యిందే వంటి ఫీల్ గుడ్ మూవీస్‌తో న‌టిగా ప్ర‌త్యేక‌మైన గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ నిత్యామీన‌న్. పాత్ర న‌చ్చితేనే నటించడానికి ఆస‌క్తి చూపుతారు. ఇన్నాళ్లూ వెండితెరపై అలరించిన కథానాయిక నిత్యామీన‌న్‌ ఇప్పుడు డిజిటల్‌లోనూ కనిపించబోతున్నారు. బాలీవుడ్ హీరో అభిషేక్‌ బచ్చన్‌తో‌ కలిసి నటిస్తున్న వెబ్‌ సిరీస్‌ ‘బ్రీత్‌: ఇన్‌ టు ది షాడోస్‌’. ఈ సిరీస్‌ మొదటి సీజన్‌ ఇప్పటికే విడుదలైంది. ఇప్పుడు రెండో సిరీస్‌కు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను ఇటీవ‌ల‌ అభిషేక్‌ విడుదల చేశారు. ‘తను నీడలో ఉంటూ.. కావాల్సిన దాని కోసం ఎదురుచూస్తోంది. ‘బ్రీత్‌: ఇన్‌ టు ది షాడోస్‌’’ అని పోస్ట్‌ చేశారు. జులై 10న ఈ సీజన్ అమెజాన్‌ ప్రైమ్‌లో ప్రసారం కాబోతోంది. ఇందులో అమిత్‌ సాద్‌, సయామీ ఖేర్‌ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

హీరోయిన్ నిత్యామీన‌న్ ‌ మొదటిసారి నటిస్తున్న వెబ్‌ సిరీస్‌ ఇది. ఈ సందర్భంగా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా ఆనందం వ్యక్తం చేశారు. మొదటి సీజన్‌ను తీసిన మయాంక్‌ శర్మ రెండో భాగానికి కూడా దర్శకత్వం వహించారు. ‘బ్రీత్‌’ సీజన్‌ 1ను సైకలాజికల్‌ థ్రిల్లర్‌గా రూపొందించారు. ఓ సాధారణ వ్యక్తి అసాధారణమైన పరిస్థితుల్ని ఎదుర్కోవడం చుట్టూ సాగే కథ అది. ఆర్‌. మాధవన్‌ నటించిన ఆ సిరీస్‌ అందర్నీ ఆకట్టుకుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here