‘24’ మూవీ సీక్వెల్‌పై స్పందించిన దర్శకుడు విక్రమ్‌ కుమార్‌

0
489
‘24’ సీక్వెల్‌

హీరో సూర్య‌, డైరెక్ట‌ర్ విక్ర‌మ్ కె.కుమార్ కాంబినేష‌న్‌లో రూపొందిన చిత్రం ‘24’. సైన్స్‌ ఫిక్షన్‌ మూవీగా రూపొందిన ఈ చిత్రం 2016లో విడుద‌లైన మంచి ప్రేక్ష‌కాద‌ర‌ణ‌ను పొందింది. అయితే తాజాగా ‘24’ సీక్వెల్‌ పై దర్శకుడు విక్రమ్‌ కుమార్‌ స్పందించారు. ‘24’ సినిమాను చేసే సమయంలోనే నేను, సూర్య సీక్వెల్ చేయాలని అనుకున్నాం. ప్రస్తుతం ఆ సీక్వెల్‌కు స్క్రిప్ట్‌ను సిద్ధం చేస్తున్నాను. ముందు స్క్రిప్ట్ నాకు న‌చ్చితేనే నేను సూర్య‌ను క‌లుస్తాను’’ అని విక్ర‌మ్ కుమార్ తెలిపారు. `24’ చిత్రంలో సూర్య త్రిపాత్రాభిన‌యం చేశారు. హీరోగానే కాకుండా విల‌న్‌గా కూడా సూర్య‌నే న‌టించ‌డం విశేషం. స‌మంత హీరోయిన్‌.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here