2 వేల మంది టివి కార్మికులకు నిత్యావ‌స‌ర వస్తువులు పంపిణీ చేసిన త‌ల‌సాని ట్రస్ట్

0
522
Talasani Trust Distributed Daily Needy for 2 thousand Television workers

కరోనా లాక్ డౌన్ వల్ల ‘ తెలుగు టెలివిజన్ పరిశ్రమ ‘ షూటింగ్స్ నిలిపివేసిన సంగతి తెలిసిందే .. ఈ తరుణం లో షూటింగ్స్ లేక ఇబ్బందులు పడుతున్న కొంత మంది టీవీ కళాకారులు ,టెక్నిషన్స్ ను ఆయా టీవీ సంఘాలు ,దాతలు ఆదుకోవడం జరిగింది . ఇటీవల సినీ పరిశ్రమ లోని ఇబ్బందులను స్వయంగా తెలుసుకునేందుకు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్ర‌ఫీ మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస యాద‌వ్ ను టివి పరిశ్రమ నుంచి టివి ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వినోద్ బాల , సెక్రటరీ విజయ్ యాదవ్ , టివి ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ప్రెసిడెంట్ ప్రసాద్ , కెమెరా అసోసియేషన్ సెక్రటరీ నర్సింగ్ రావు పలు సంఘాల నాయకులు తెలుగు టెలివిజన్ పరిశ్రమ సమస్యలను వివరించారు . టివి ఇండస్ట్రీ సమస్యలు పరిష్కరించేందుకు సుముఖం వ్యక్తం చేసిన మంత్రి తలసాని తన “తలసాని ట్రస్ట్ ” ద్వారా 2 వేల మంది టివి కార్మికులకు నిత్యావసర వస్తువులను టీవీ ఇండస్ట్రీ పెద్దలకు అందచేయడం జరిగింది …ఆ వితరణను అన్ని సంఘాల నాయకుల సమక్షం లో నేడు హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో పంపిణీ చేయడం జరిగింది.. సహాయం పొందిన కార్మికులు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు కృతజ్ఞతలు తెలుపుగా .. టివి పరిశ్రమ అభివృద్ధికి మరింతగా తోడ్పాడాలని టివి సంఘాల నాయకులు కోరారు .

ఈ కార్యక్రమంలో టివి ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వినోద్ బాల , సెక్రటరీ విజయ్ యాదవ్ , టివి ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ప్రెసిడెంట్ ప్రసాద్ , మన స్టూడియో అధినేత మన చౌదరి , యాట సత్యనారాయణ,కెమెరా అసోసియేషన్ సెక్రటరీ నర్సింగ్ రావు , శ్రీ శశాంక్ , కాదంబరి కిరణ్ , నటి జయవాణి , నాని ,రాజేష్ , శ్రీనివాస్ ఎం మురళీ ,పి మురళి కృష్ణా రెడ్డి ,మురారి , డి రాజేష్ – విజయ్ కుమార్ , ఆర్ పవన్ , పి.మురళీ కృష్ణ పలు సంఘాల నాయకులు పాల్గొన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here