సూప‌ర్ స్టార్ కృష్ణ ఫ్యాన్స్‌కు ప‌ర్ఫెక్ట్ గిఫ్ట్ ఇచ్చిన అశోక్ గ‌ల్లా

0
411
special video on Superstar Krishna's birthday

సూప‌ర్ స్టార్ కృష్ణ మ‌న‌వ‌డు, గుంటూరు ఎంపీ జ‌య‌దేవ్ గ‌ల్లా త‌న‌యుడు అశోక్ గ‌ల్లా హీరోగా ప‌రిచ‌య‌మ‌వుతున్నాడు. ఇంకా టైటిల్ పెట్ట‌ని ఈ సినిమాకు శ్రీ‌రామ్ ఆదిత్య ద‌ర్శ‌కుడు. సూప‌ర్‌ స్టార్ కృష్ణ జ‌న్మ‌దినాన్ని పుర‌స్క‌రించుకొని ఆదివారం (మే 31) సినిమా నిర్మాత‌లు ఓ స్పెష‌ల్ వీడియోను రిలీజ్ చేశారు. నిజానికి అది ‘య‌మ‌లీల’ చిత్రంలో సూప‌ర్‌స్టార్ కృష్ణ చేసిన సూప‌ర్ హిట్ సాంగ్ ‘జుంబారే’కు రీమిక్స్‌.

లెజండ‌రీ అయిన తాత‌య్య‌ను ఆ పాట‌లో అశోక్ గ‌ల్లా ఇమిటేట్ చేసిన విధానం అమితంగా ఆక‌ట్టుకుంటోంది. కాస్ట్యూమ్స్‌, సెట్స్.. పాట‌కు స‌రిగ్గా స‌రిపోయాయి. ఆ పాట‌లో హీరోయిన్ నిధి అగ‌ర్వాల్ సైతం మెర‌వ‌డంతో ఈ ప్ర‌త్యేక‌మైన రోజు సూప‌ర్‌ స్టార్ కృష్ణ జ‌న్మ‌దినాన్ని పుర‌స్క‌రించుకొని ఫ్యాన్స్‌కు ప‌ర్ఫెక్ట్ గిఫ్ట్ ఇచ్చిన‌ట్ల‌యింది.

ఇంకా టైటిల్ నిర్ణ‌యించ‌ని ఈ సినిమాకు సంబంధించి ఇప్ప‌టివ‌ర‌కూ 50 శాతం చిత్రీక‌ర‌ణ జ‌రిగింది. జిబ్రాన్ సంగీతం స‌మ‌కూరుస్తున్న ఈ సినిమాకు రిచ‌ర్డ్ ప్ర‌సాద్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేస్తున్నారు.

అమ‌ర‌రాజా మీడియా అండ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై ప‌ద్మావ‌తి గ‌ల్లా నిర్మిస్తోన్న ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌గా చంద్ర‌శేఖ‌ర్ రావిపాటి వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

తారాగ‌ణం:
అశోక్ గ‌ల్లా, నిధి అగ‌ర్వాల్, జ‌గ‌ప‌తిబాబు, న‌రేష్‌, స‌త్య‌, అర్చ‌నా సౌంద‌ర్య‌

సాంకేతిక బృందం:
డైలాగ్స్‌: క‌ల్యాణ్ శంక‌ర్‌, ఎ.ఆర్‌. ఠాగూర్‌
మ్యూజిక్‌: జిబ్రాన్‌
సినిమాటోగ్ర‌ఫీ: రిచ‌ర్డ్ ప్ర‌సాద్‌, సమీర్ రెడ్డి
ఎడిట‌ర్‌: ప‌్ర‌వీణ్ పూడి
ఆర్ట్‌: ఎ. రామాంజ‌నేయులు
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: చ‌ంద్రశేఖ‌ర్ రావిపాటి
నిర్మాత‌: ప‌ద్మావ‌తి గ‌ల్లా
క‌థ‌, స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వం: శ్రీ‌రామ్ ఆదిత్య టి.
బ్యాన‌ర్‌: అమ‌ర‌రాజా మీడియా అండ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here