బాలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకుల ద్వయం సాజిద్ – వాజిద్ లో వాజిద్ ఖాన్ నేడు కరోనా తో మృతి చెందారు. వాజిద్ వయసు 42 సంవత్సరాలు. పలు సూపర్ హిట్ చిత్రాలకు సంగీతం అందించారు. సల్మాన్ ఖాన్ పరిచయం చేసిన ఈ సంగీత ద్వయం చాలా సల్మాన్ చిత్రాలకు హిట్ సాంగ్స్ అందించారు. వాజిద్ చివరి పాట సల్మాన్ ఖాన్ కోసం కంపోజ్ చేసిన ‘భాయ్ భాయ్’ కావడం యాదృచ్ఛికం. వాజీద్ మృతి పట్ల పలువురు బాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలుపుతూ పోస్ట్ చేస్తున్నారు.