‘డార్క్ చాక్లెట్‌’ లాంటి సినిమా ఇంతకుముందు ఎప్పుడూ రాలేదు. ఈ సినిమా ఒక బెంచ్‌మార్క్‌లా నిలబడిపోతుందనే నమ్మకం ఉంది: ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో హీరో విశ్వదేవ్ రాచకొండ

0
2
Dark Chocolate Trailer Launch Event
Dark Chocolate Trailer Launch Event

‘డార్క్ చాక్లెట్‌’ లాంటి సినిమా ఇంతకుముందు ఎప్పుడూ రాలేదు. ఈ సినిమా ఒక బెంచ్‌మార్క్‌లా నిలబడిపోతుందనే నమ్మకం ఉంది: ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో హీరో విశ్వదేవ్ రాచకొండ

రానా దగ్గుబాటి ప్రెజెంట్స్, విశ్వదేవ్ రాచకొండ, బిందు మాధవి, శశాంక్ శ్రీవాస్తవయ, వాల్టెయిర్ ప్రొడక్షన్స్ & స్పిరిట్ మీడియా డార్క్ చాక్లెట్ ట్రైలర్ లాంచ్

రానా దగ్గుబాటి, స్పిరిట్ మీడియా, వాల్టెయిర్ ప్రొడక్షన్స్‌తో కలిసి ‘డార్క్ చాక్లెట్‌’ చిత్రాన్ని ను సగర్వంగా అందిస్తున్నారు. విశ్వదేవ్ రాచకొండ,  బిందు మాధవి లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. శశాంక్ శ్రీవాస్తవయ దర్శకత్వం వహించిన ఈ సినిమా  ప్రమోషనల్ కంటెంట్ కు ఇప్పటికే మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా నవంబర్ 13న విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ట్రైలర్ లాంచ్ చేశారు.

హీరో విశ్వదేవ్ రాచకొండ మాట్లాడుతూ..“అందరికీ నమస్కారం. ప్రతి మనిషిలో ఒక డ్యూయాలిటీ ఉంటుంది. అది ఈ సినిమా చూసినప్పుడు మిర్రర్ రిఫ్లెక్షన్స్‌లా మీకు కనిపిస్తుంది. ఇది నెవర్ బిఫోర్, ఎవర్ ఆఫ్టర్‌లాంటి సినిమా. ఇలాంటి సినిమా ఇంతకుముందు ఎప్పుడూ రాలేదు. ఏ భాషలో వచ్చిన సినిమాతోనూ దీనిని కంపేర్ చేయలేరు. ఇది ఒక తెలుగు సినిమా అని గర్వంగా చెప్తున్నాను. డైరెక్టర్ శశాంక్ ఈ సినిమాను చాలా విభిన్నంగా తీశాడు. ఇందులో చాలా లేయర్స్ ఉంటాయి. వండర్‌ఫుల్ ఎక్స్‌పీరియెన్స్, ఎక్స్‌పెరిమెంట్ ఉంది. మేము ఈ సినిమా స్క్రిప్ట్‌ను అప్‌లోడ్ చేసినా, మీరు స్క్రిప్ట్ చదువుకుని థియేటర్‌కు వచ్చినా ఎలాంటి మార్పు ఉండదు. కచ్చితంగా ఒక కొత్త, డిఫరెంట్ ఎక్స్‌పీరియెన్స్ ఇస్తుంది. ఈ సినిమా చూసిన తర్వాత తప్పకుండా దాని గురించి మాట్లాడుకునేలా ఉంటుంది. ‘35’, ‘పరేషాన్’, ‘డబుల్ ఇంజన్’ సినిమాలన్నీ నిజాయితీగా చేసినవే. డార్క్ చాక్లెట్ సినిమా చాలా ఎంగేజింగ్‌గా ఉంటుంది. ఇప్పటికే కొన్ని  స్క్రీనింగ్స్‌ వేశాం. ఐదుసార్లు చూసిన వాళ్లు కూడా ఉన్నారు. వాళ్లు ఎందుకు ఇన్నిసార్లు చూస్తున్నారు అనేది మీకు సినిమా చూసిన తర్వాత అర్థమవుతుంది. ఈ సినిమా మ్యూజిక్ కూడా చాలా కొత్తగా ఉంటుంది. ఈ సినిమా తరతరాల పాటు గుర్తుండిపోయి, ఒక బెంచ్‌మార్క్‌లా నిలబడిపోతుందనే నమ్మకం ఉంది. నవంబర్ 13న ‘డార్క్ చాక్లెట్’ మీ అందరికీ ఒక కొత్త ఎక్స్‌పీరియెన్స్ ఇస్తుంది. కచ్చితంగా ఈ సినిమాను మళ్లీ మళ్లీ చూసేలా ఉంటుంది.

బిందు మాధవి మాట్లాడుతూ..బిగ్ స్క్రీన్ మీద ట్రైలర్ చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది. చాలా అద్భుతంగా ఉంది. ఇలాంటి సినిమా చేయాలని నాకు ఎప్పటినుంచో ఉండేది. ‘డార్క్ చాక్లెట్’ వల్ల అది నెరవేరింది. ఇది రెగ్యులర్ ఫార్మాట్‌లో ఉండే సినిమా కాదు. చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. ప్రేక్షకులు చాలా ఎంజాయ్ చేస్తారు. ఇలాంటి సినిమా చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. నవంబర్ 13న ఈ సినిమా థియేటర్లలోకి వస్తుంది. అందరూ సినిమా చూసి ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను.”

దర్శకుడు శశాంక్ శ్రీవాస్తవ్ మాట్లాడుతూ..అందరికీ నమస్కారం. సాధారణంగా ఒక ట్రైలర్‌లో, సినిమా గురించి వచ్చిన క్రిటికల్ క్లెయిమ్స్ లేదా మంచి వర్డ్ ఆఫ్ మౌత్‌ను చూపించడానికి హాలీవుడ్ టైమ్స్, న్యూయార్క్ టైమ్స్, టైమ్స్ ఆఫ్ ఇండియా వంటి పత్రికలు ఏమన్నాయో కొన్ని కోటెడ్ టెక్స్ట్‌లను పెడుతుంటారు. కానీ మా ట్రైలర్‌లో పెట్టిన కోట్స్ నేరుగా పబ్లిక్ నుంచి వచ్చినవి. మేము నిర్వహించిన డైరెక్ట్ స్క్రీనింగ్స్‌లో ప్రేక్షకులు ఇచ్చిన రివ్యూస్ అవి. సీక్రెట్ స్క్రీనింగ్స్ అనే ఆలోచనతో మేము చాలా స్క్రీనింగ్స్ నిర్వహించాం. వాటిలో వచ్చిన రివ్యూస్ నుంచే ట్రైలర్‌లో మీరు చూసిన ప్రతి పదం, ప్రతి కోట్ తీసుకున్నాం.ఇలాంటి సినిమాను మీరు తెలుగులో ఎప్పుడూ చూడలేదనడంలో డౌట్ లేదు. కొంతమంది అయితే భారతదేశంలోనే ఇలాంటి ప్రయత్నాన్ని తాము చూడలేదని చెప్పారు. ఇది బ్లెండ్ ఆఫ్ జానర్స్. నా ఫెంటాస్టిక్ యాక్టర్స్ విశ్వదేవ్, అమేజింగ్ బిందు మాధవికి థాంక్యూ. బిందు ఈ సినిమాకు చాలా ప్లెజెంట్ సర్‌ప్రైజ్.  అందరికీ థాంక్ యూ.

రాకేష్ రాచకొండ మాట్లాడుతూ.. ఈ సినిమాలో నేను చేసిన పాత్ర ఒక నటుడిగా నాకు చాలా సంతృప్తినిచ్చింది. ఇలాంటి కథను రాయాలన్నా, తెరకెక్కించాలన్నా దర్శక నిర్మాతలకు మంచి అభిరుచి ఉండాలి. ఈ సినిమా ప్రత్యేకంగా, వైవిధ్యంగా రూపొందుతోంది. విశ్వదేవ్ ప్రతి సినిమాను వైవిధ్యంగా చేస్తున్నారు. వివేక్ సాగర్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. తప్పకుండా ఈ సినిమా కొత్త అనుభూతి ఇస్తుంది.

ప్రొడక్షన్ డిజైనర్ నాగవ్ మాట్లాడుతూ.. ఈ అవకాశం ఇచ్చినందుకు ముందుగా శశాంక్‌కు థాంక్స్. ఈ ఐడియాను అతను మొదటిసారి నాకు చెప్పినప్పుడు, దాని గురించి ఆలోచిస్తూ దాదాపు ఒక వారం గడిచిపోయింది. నాకు నిద్ర కూడా పట్టలేదు. మరో పని చేయాలనిపించలేదు. ఈ ప్రాజెక్టే నేను చేయాల్సిన పని అని అనిపించింది. సినిమాకి ఒక విజువల్ ఐడెంటిటీని క్రియేట్ చేశాం. మీరందరూ ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను. మార్కెట్‌లో చాలా రకాల చాక్లెట్లు ఉంటాయి. వాటన్నింటిలో మా ‘డార్క్ చాక్లెట్’ ఒక డిఫరెంట్ చాక్లెట్‌లా నిలుస్తుందని ఆశిస్తున్నాను. ఈ వేడుకలో సినిమా యూనిట్ అందరూ పాల్గొన్నారు.

తారాగణం: విశ్వదేవ్ రాచకొండ, బిందు మాధవి

సాంకేతిక సిబ్బంది:
రచయిత, దర్శకత్వం: శశాంక్ శ్రీవాస్తవయ
సమర్పణ: రానా దగ్గుబాటి
నిర్మాతలు: స్పిరిట్ మీడియా,  వాల్టెయిర్ ప్రొడక్షన్స్
సంగీతం: వివేక్ సాగర్
సౌండ్ మిక్స్: అజిత్ అబ్రహం జార్జ్
పీఆర్వో: వంశీ-శేఖర్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here