ప్రస్తుతం కరోనా ఎఫెక్ట్ తో దేశమంతటా లాక్ డౌన్ విధించడం వలన తన కుటుంబంతో కలిసి సరదాగా గడుపుతున్న సూపర్ స్టార్ మహేష్ బాబు, రేపు తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ గారి జన్మదినం నాడు సాయంత్రం 5 గంటలకు సోషల్ మీడియా మాధ్యమం ఇన్స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో చాట్ సెషన్ ద్వారా ముచ్చటించనున్నారు.
కాసేపటి క్రితం ఈ ప్రకటన రాగానే సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. మహేష్ తమతో ముచ్చటించే సమయం కోసం వారు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు……!!



